close

తాజా వార్తలు

Published : 10/04/2021 02:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

బరువు పెరగొద్దంటే...

బరువు తగ్గాలని ఏవేవో వ్యాయామాలు చేస్తాం. ఏం తింటే బరువు తగ్గుతామో తెలుసుకుని మరీ పాటిస్తాం. అసలు బరువు తగ్గడం మాటఅటుంచి పెరగకుండా ఉండేందుకు ఏం చేయాలో తెలుసుకుంటే పోలా!

ఉప్పు తగ్గించండి: తినే ఆహారంలో ఉప్పు శాతాన్ని తగ్గించండి. ఎందుకంటే ఉప్పు, శరీరంలో నీటిశాతాన్ని తగ్గించేస్తుంది. కాబట్టి ఉప్పు ఎక్కువ తీసుకుంటే బరువు పెరిగే అవకాశం ఉంది.
నిల్వ పండ్ల రసాలు వద్దు... అదేంటి జ్యూస్‌ మంచిదేగా అంటారా! ఇంట్లో చేసుకునేదైతే ఫర్వాలేదు. కానీ బయట దొరికే ప్యాకేజ్డ్‌, టిన్‌ రకాల్లో షుగర్‌, ప్రిజర్వేటివ్స్‌, సోడా వంటివి ఎక్కువ కలుపుతారు. ఫలితంగా పండ్లలో ఉండే ప్రొటీన్లు పోయి కెలోరీలు, సోడియం నిల్వలు శరీరంలో పెరుగుతాయి. దాంతో  బరువు అదుపు తప్పుతుంది.
సోడాకి చెక్‌: సోడాలో పోషకాలు ఏమీ ఉండవు. కానీ కెలొరీలు పుష్కలంగా ఉంటాయి. అందుకే ఇట్టే బరువు పెరుగుతారు.
జంక్‌ఫుడ్‌కి దూరం: ఇవి ఆకలిని తీర్చినా... శరీరానికి కావలసిన పోషకాల్ని మాత్రం అందించవు. ఫలితంగా రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. జంక్‌ఫుడ్‌లో కెలోరీలు ఎక్కువ. అవి జీర్ణ ప్రక్రియపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయి. అందుకే బరువు పెరుగుతారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని