close

తాజా వార్తలు

Updated : 14/01/2021 21:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్ 10 న్యూస్ @ 9 PM

1. రామతీర్థం ఘటన ఓ హెచ్చరిక: చినజీయర్‌ స్వామి

విజయనగరం జిల్లా నెల్లిమర్లలోని రామతీర్థంలో శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి పర్యటించారు. పర్యటనలో భాగంగా కోదండ రామాలయాన్ని సందర్శించారు. అక్కడ కొండపైన ఆలయంలో దుండగులు ధ్వంసం చేసిన స్వామివారి విగ్రహం, ధ్వంసమైన స్వామివారి విగ్రహం లభించిన కొలనును పరిశీలించారు. కోదండరాముడి విగ్రహ ధ్వంసం ఘటనకు సంబంధించిన వివరాలు అక్కడి అధికారులు ఆయనకు వివరించారు. లోపాలను సరిదిద్దేందుకు అవసరమైన చర్యలు సూచిస్తామని చినజీయర్‌ స్వామి తెలిపారు. అలాగే ఈ ఘటనలను హెచ్చరికగా తీసుకొని రాష్ట్రంలోని మారుమూల ఆలయాలను గుర్తించి ఏడాదిలోగా తగిన సదుపాయాలు కల్పించి, రక్షణ చర్యలు తీసుకోవాలని దేవాదాయశాఖకు సూచించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. 29 నుంచి బడ్జెట్‌ సమావేశాలు 

పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు జనవరి 29 నుంచి ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 1న ఉదయం 11గంటలకు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ కేంద్ర బడ్జెట్‌ - 2021-22ని ప్రవేశ పెట్టనున్నారు. ఈ మేరకు లోక్‌సభ సచివాలయం గురువారం ప్రకటన జారీచేసింది. ఫిబ్రవరి 15 నుంచి మార్చి 8 వరకు (20 రోజుల పాటు) విరామం తర్వాత మళ్లీ ప్రారంభం కానున్న ఈ బడ్జెట్‌ సమావేశాలు ఏప్రిల్‌ 8తో ముగిసే అవకాశం ఉన్నట్టు పేర్కొంది. ఈ సమావేశాలు ప్రారంభం రోజున ఉదయం 11గంటలకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. జ్యోతి దర్శనం.. శరణం అయ్యప్ప

హరిహరక్షేత్రం శబరిమల ‘స్వామియే శరణం అయ్యప్ప’ అంటూ భక్తిసాగరంలో మునిగిపోయింది. మకర సంక్రాంతి సందర్భంగా జ్యోతి దర్శనం కోసం సుదీర్ఘంగా నిరీక్షించారు. ఆ నిరీక్షణకు తెరవేస్తూ ఆలయానికి ఈశాన్య దిశలో పర్వతశ్రేణుల నుంచి వెలుగులీనుతున్న జ్యోతి దర్శనమిచ్చింది. జ్యోతి దర్శనంతో వేలాది భక్తులు పులకించిపోయారు. హరిహర సుతుడైన స్వామి అయ్యప్పను స్మరిస్తూ స్వామియే శరణం అయ్యప్ప అన్న శరణుఘోషలతో శబరిగిరులు ప్రతిధ్వనించాయి. కాంతమాల కొండలపై దేవతలు, రుషులు కలిసి భగవంతునికి హారతి ఇస్తారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఆ పసివాడు మృత్యుంజయుడు!

ఒంటిపై చిన్న దెబ్బతగిలితేనే పసి ప్రాణాలు తట్టుకోలేవు. అలాంటిది ఏకంగా కారు రెండు టైర్ల మధ్యలో చిక్కుకొని కొంత దూరం ఈడ్చుకెళ్తే.. ఊహించలేకుండా ఉంది కదా! అవునండీ.. ఇలాంటి హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లో చోటు చేసుకుంది. అయితే ఆ చిన్నారి తృటిలో తప్పించుకొని మృత్యుంజయుడిగా నిలిచాడు. వివరాల్లోకి వెళ్తే.. నగరంలోని రాజేంద్రనగర్‌ పోలీసుస్టేషన్‌ పరిధి ఉప్పర్‌పల్లిలోని అశోక్‌ విహార్‌లో ఓ చిన్నారి గేటు ముందు ఆడుకుంటున్నాడు. అదే సమయంలో సెల్లార్‌ నుంచి ఓ కారు బయటకు వెళ్తుతోంది. ఈ క్రమంలో అక్కడే ఆడుకుంటున్న చిన్నారిని గమనించని కారు డ్రైవర్‌ కారుని ముందుకు తీసుకెళ్లాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. 13 హెలికాప్టర్లతో కొనసాగుతున్న గాలింపు 

ఇండోనేసియాలో 62మంది ప్రయాణికులతో ఇటీవల అదృశ్యమైన విమానం సముద్రంలో కూలిపోవడం పెను విషాదం నింపింది. ఈ ఘోర ప్రమాదంలో మృతులు, విమాన శకలాలను గుర్తించేందుకు ప్రభుత్వం అన్వేషణ కొనసాగిస్తోంది. శ్రీవిజయ విమానయాన సంస్థకు చెందిన బోయింగ్‌ ఫ్లైట్‌ నుంచి విడిపోయిన కాక్‌పిట్‌ వాయిస్‌ రికార్డర్‌ కోసం డైవర్లు  థౌజెండ్‌ ఐలాండ్‌లోని జావా సముద్ర తీర ప్రాంతాల్లో గాలింపును మరింత ముమ్మరం చేశారు. సముద్ర ప్రవాహంలో విమాన శిథిలాలు, బాధితులను గుర్తించే వీలుంటుందని తెలిపారు. గాలింపు చర్యల కోసం 4100 మంది సహాయక సిబ్బంది, 13 హెలికాఫ్టర్లు, 55 ఓడలు, 18 రాఫ్ట్ బోట్‌లను రంగంలోకి దించినట్టు నేవీ అధికారులు వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఈ ల్యాపీల రేంజ్‌... వేరే లెవల్‌!

గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం కన్‌జ్యూమర్ ఎలక్ట్రానిక్‌ షో (సీఈఎస్‌) 2021 కాస్త మందకొడిగానే సాగుతోందని చెప్పాలి. మొదటి, రెండో రోజు ప్రదర్శనలో రోలింగ్‌ డిస్‌ప్లే ఫోన్లు, తర్వాతి తరం ప్రాసెసర్‌లు, ఎగిరే కార్లు, సూపర్‌ స్మార్ట్ మాస్కులు, గేమింగ్ కుర్చీలతో పాటు పలు స్మార్ట్ గృహోపకరణాలను ఆవిష్కరించారు. మూడో రోజు ప్రదర్శనలో ఎక్కువగా గేమర్స్‌కు ఉపయోగపడే ల్యాప్‌టాప్‌లు, మానిటర్స్‌, గ్రాఫిక్ కార్డ్స్‌ను తీసుకొచ్చారు. మరింకెదుకు ఆలస్యం..ఆ జాబితా ఏంటో చూద్దాం.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. సైనా పరాజయం.. కిదాంబి వాకోవర్‌

థాయ్‌లాండ్‌ ఓపెన్లో భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్‌ క్రీడాకారుల కథ ముగిసింది. కొందరు తొలి, రెండో రౌండ్లోనే పరాజయం పాలవ్వగా మరికొందరు ఫిట్‌నెస్‌ ఇబ్బందులతో మధ్యలో తప్పుకున్నారు. యోనెక్స్‌ థాయ్‌లాండ్‌ ఓపెన్‌ సూపర్‌ 1000 మహిళల రెండో రౌండ్లో సైనా నెహ్వాల్‌ ఓటమిపాలైంది. స్థానిక షట్లర్‌, ప్రపంచ 12వ ర్యాంకర్‌ బుసానన్‌ చేతిలో 23-21, 14-21, 16-21 తేడాతో పోరాడి ఓడింది. దాదాపు 68 నిమిషాలు జరిగిన ఈ పోరులో ప్రత్యర్థులిద్దరూ హోరాహోరీగా తలపడ్డారు. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో రెండో రౌండ్‌కు చేరుకున్న మాజీ ప్రపంచ నంబర్‌వన్‌ కిదాంబి శ్రీకాంత్‌ వాకోవర్‌ ప్రకటించాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. సిగ్నల్‌, టెలిగ్రాం డౌన్‌లోడ్లు ఎన్ని పెరిగాయంటే..!

మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ వ్యక్తిగత గోప్యతా విధానం వివాదంగా మారడం మిగతా యాప్‌లకు సంబరంగా మారింది. గూగుల్‌ ప్లేస్టోర్‌, యాపిల్‌ స్టోర్‌లో సిగ్నల్‌, టెలిగ్రాం యాప్‌ల డౌన్‌లోడ్లు విపరీతంగా పెరిగాయి. జనవరి 5 నుంచి 12 మధ్య గూగుల్‌, యాపిల్‌ స్టోర్ల నుంచి సిగ్నల్‌ యాప్‌ను 17.8 మిలియన్ల మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారని మొబైల్‌ యాప్‌ అనలిటిక్స్‌ సంస్థ సెన్సర్‌ టవర్‌ తెలిపింది. అంతకు ముందు వారంలోని 2,85,000 డౌన్‌లోడ్లతో పోలిస్తే ఇది 61% పెరుగుదల కావడం గమనార్హం. సిగ్నల్‌ తరహాలోనే టెలిగ్రాం యాప్‌కూ గిరాకీ పెరిగింది. జనవరి 5 నుంచి 12 మధ్య 15.7 మిలియన్ల డౌన్‌లోడ్లు నమోదయ్యాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. లండన్‌ను దాటిన బెంగళూరు

ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న టెక్‌ నగరంగా భారత టెక్నాలజీ రాజధాని బెంగళూరు అవతరించింది. దీని తర్వాతి స్థానాల్లో లండన్‌, మ్యూనిక్‌, బెర్లిన్‌, పారిస్‌ ఉన్నాయి. ఆ తర్వాత ఆరో స్థానంలో భారత్‌ ఆర్థిక రాజధాని ముంబయి నిలిచింది. లండన్‌& పార్టనర్స్‌ అనే అంతర్జాతీయ వాణిజ్య, పెట్టుబడుల సంస్థ డీల్‌రూం.కాం డాటాను విశ్లేషించింది. ఈ వివరాల ప్రకారం 2016 నుంచి 2020 వరకూ బెంగళూరులో పెట్టుబడులు 5.4 రెట్లు పెరిగిందన్నారు. ముంబయిలో పెట్టుబడులు 1.7 రెట్లు పెరిగాయని తెలిపారు. లండన్‌లో పెట్టుబడులు 3రెట్లు పెరిగినట్లు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. పవన్‌కల్యాణ్‌ ‘వకీల్‌సాబ్‌’ టీజర్‌ అదుర్స్‌

అగ్ర కథానాయకుడు పవన్‌కల్యాణ్‌ కీలక పాత్రలో వేణు శ్రీరామ్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘వకీల్‌సాబ్‌’. శ్రుతిహాసన్‌ కథానాయిక. సంక్రాంతి పండగను పురస్కరించుకుని ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. ‘అజ్ఞాతవాసి’ తర్వాత రాజకీయాలతో సినిమాలకు దూరమైన పవన్‌ తిరిగి ‘వకీల్‌సాబ్‌’తో అలరించేందుకు సిద్ధమయ్యారు. ‘కోర్టులో వాదించటమూ తెలుసు.. కోటు తీసి కొట్టడమూ తెలుసు’ అంటూ పవన్‌ చెప్పిన డైలాగ్‌ అలరిస్తోంది. హిందీలో ఘన విజయం సాధించిన ‘పింక్‌’ చిత్రాన్ని తెలుగులో ‘వకీల్‌సాబ్‌’ పేరుతో రీమేక్‌ చేస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ఆ వీడియోకాల్‌ను హ్యాక్‌ చేసిందెవరు..?Tags :

జనరల్‌

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని