
తాజా వార్తలు
ఉచిత మంచినీరు..మార్గదర్శకాలు విడుదల
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్‌లో ఉచిత మంచినీటి పథకానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ పథకానికి ఆధార్ కార్డును ప్రామాణికం చేసింది. బస్తీల్లో మాత్రం నల్లాలకు మీటర్లు లేకున్నా డాకెట్ ఆధారంగా బిల్లులు వసూలు యనున్నారు. అపార్టుమెంట్లలో మాత్రం తప్పని సరిగా మీటర్లు ఉండాలనే నిబంధన విధించారు. నీటి వినియోగం 20వేల లీటర్లు దాటితే ప్రస్తుతం చెల్లిస్తున్న టారిఫ్ ప్రకారం బిల్లు వసూలు చేయనున్నారు. నగరంలోని మురికివాడలు, బస్తీ ఏరియాల్లో ఉన్న నల్లా కనెక్షన్లకు పూర్తిగా నీటి బిల్లు రద్దు చేశారు. ప్రత్యేకంగా మీటర్లు బిగించుకోవాల్సిన అవసరం లేకుండానే పథకం వర్తింప చేయనున్నారు. డొమెస్టిక్ యూజర్లు 20 వేల లీటర్ల ఉచితనీరు పొందాలంటే మీటర్ తప్పని సరిచేస్తూ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ఇలాంటి వాళ్లు సొంత ఖర్చులతోనే మీటరు బిగించుకోవాలని జలమండలి అధికారులు తెలిపారు. అపార్టుమెంట్లలోని వారికి జలమండలి కాస్త వెసులుబాటు కల్పించింది. ఒక్కో ఫ్లాటుకు 20 వేల లీటర్ల చొప్పున మొత్తం ఫ్లాట్లకు మంచినీళ్లు అందిస్తారు.అంటే ఈ లెక్కన 10 ఫ్లాట్లు ఉండే అపార్టుమెంట్‌కు 2 లక్షల లీటర్ల వరకు ఉచితంగా నీరు ఇస్తారు.