
తాజా వార్తలు
12 మందితో లంక ఆట: ఐసీసీ సీరియస్!
ఇంటర్నెట్ డెస్క్: ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టెస్టులో శ్రీలంక 12మంది ఆటగాళ్లతో బరిలోకి దిగింది. ఫలితంగా ఐసీసీ రంగంలోకి దిగింది. పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని బదులిచ్చింది. అదేంటి మైదానంలో 11 మందితోనే కదా అడుగు పెడతారు? లంకేయులకు ఆ మాత్రం తెలియదా అనుకుంటున్నారా? అయితే మీరిది చదవాల్సిందే!
గాలె వేదికగా జరిగిన ఈ టెస్టుకు అనుకోని అతిథి వచ్చాడు. ఇంగ్లాండ్ బ్యాటింగ్ చేస్తుండగా ఉడుము తరహాలో ఉండే ఓ జంతువు బౌండరీ సరిహద్దు వద్దకు వచ్చి నిలబడింది. అక్కడ ఫీల్డింగ్ చేస్తున్నట్టుగా అనిపించింది. టీవీ తెరలపై కనిపించిన ఈ దృశ్యాన్ని నెటిజన్లు ట్విటర్లో వైరల్ చేశారు. దీనిపై ఐసీసీ వ్యంగ్యాస్త్రం విసిరింది. లంక అదనపు ఫీల్డర్‌ను మోహరించిందని సెటైర్ వేసింది. ‘గాలెలో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నేటి పోరులో లంక అదనపు ఫీల్డర్‌ను మోహరించిందన్న వార్తలను ఐసీసీ సమీక్షిస్తోంది. పరిస్థితులను పర్యవేక్షిస్తాం’ అంటూ ఐసీసీ ట్వీట్ చేసింది.
మరోవైపు శ్రీలంకపై ఇంగ్లాండ్ ఘన విజయం సాధించింది. 6 వికెట్ల తేడాతో రెండో టెస్టులో గెలుపొందింది. తొలుత లంక 381 పరుగులు చేయగా ఇంగ్లాండ్ 344 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో లంకను 126కే ఆలౌట్ చేసింది ఇంగ్లిష్ జట్టు. ఆ తర్వాత స్వల్ప లక్ష్యాన్ని రూట్ సేన సునాయసంగా ఛేదించింది. ఈ మ్యాచు తొలి ఇన్నింగ్స్‌లో జో రూట్ 186 పరుగులు చేయడం గమనార్హం. తొలి టెస్టులో అతడు ఏకంగా ద్విశతకం (228) బాదేయడం గమనార్హం.
ఇవీ చదవండి
కుంబ్లేను ఎదుర్కోడానికి ద్రవిడ్ సాయం: తైబు
శార్దూల్, సిరాజ్ రచించిన గబ్బా బౌలింగ్ వ్యూహం!