అకస్మాత్తు అగ్ని ప్రమాదాలు.. జాగ్రత్తే శ్రీరామరక్ష
close

తాజా వార్తలు

Published : 30/03/2021 20:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అకస్మాత్తు అగ్ని ప్రమాదాలు.. జాగ్రత్తే శ్రీరామరక్ష

తనిఖీ చేసుకోవాలంటున్న నిపుణులు

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రయాణిస్తుండగా వాహనంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగి.. కారణం అర్థమయ్యేలోపే ఆ వాహనం దగ్ధమైపోతుంది. వేసవిలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతాయని.. చిన్నచిన్న జాగ్రత్తలు తీసుకోకపోవడమే ఇందుకు కారణమని అగ్నిమాపక శాఖ అవగాహన కల్పిస్తోంది. దూర ప్రయాణాల్లో వాహనాలు సహజంగానే వేడెక్కుతాయి. వేసవి ఉష్ణోగ్రతలకు ఇంజిన్‌ ఉష్ణోగ్రతలు తోడై వాహనాలు సాధారణ సమయాల్లో కంటే ఎక్కువ వేడెక్కుతాయి. ఇది అగ్ని ప్రమాదాలకు దారి తీస్తోంది. ఇంజిన్‌లో చెలరేగే మంటలు సకాలంలో ఆపకపోతే వేగంగా వ్యాపించి వాహనం పూర్తిగా దగ్ధమవుతోంది. 

వాహనాల్లో అగ్ని ప్రమాదాల నివారణకు కనీస జాగ్రత్తలు తీసుకోవాలని అగ్నిమాపక శాఖ సూచిస్తోంది. వాహనాల్లో ఆయిల్‌, కూలెంట్లను నెలల తరబడి మార్చకుండా ఉంటే అది చిక్కబడుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. వాహనంలో ఆయిల్‌ ఉష్ణోగ్రతలు పెరిగినపుడు ప్లాస్టిక్‌ పైపు, ఎలక్ట్రిక్‌ వైర్లు వేడెక్కి అగ్ని ప్రమాదం సంభవించే అవకాశం ఉందన్నారు. బ్యాటరీ స్థాయిని మించే స్పీకర్లు, ఎల్‌ఈడీలు అమర్చడంతో షార్ట్‌సర్క్యూట్‌ జరుగుతోందని హెచ్చరిస్తున్నారు. మైలేజీ కోసం ఎల్‌పీజీ, సీఎన్‌జీ గ్యాస్‌ వినియోగించేవారు కంపెనీ నుంచి కాకుండా స్థానికంగా నింపేటప్పుడు లీక్‌ కావడం కూడా ప్రమాదాలకు కారణమని పేర్కొన్నారు.

సౌకర్యం కోసం వాహనాల్లో ఎన్నో ఏర్పాట్లు చేసే బదులు ప్రమాదాల నివారణకు స్ప్రే, ఇతర పరికరాలు ఉంచుకోవాలని సూచిస్తున్నారు. కార్లలో ఏసీ సిలిండర్‌ను ఎప్పటికప్పుడు సరిచూసుకోవాలని, 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు చిన్న అనుమానం వచ్చినా వాహనంలోనుంచి దిగి తనిఖీ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని