ఎస్‌ఈసీ దారుణంగా వ్యవహరిస్తున్నారు: వర్ల రామయ్య
close

తాజా వార్తలు

Published : 01/03/2021 13:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎస్‌ఈసీ దారుణంగా వ్యవహరిస్తున్నారు: వర్ల రామయ్య

విజయవాడ: ఎస్‌ఈసీ దారుణంగా వ్యవహరిస్తున్నారని తెదేపా నేత వర్లరామయ్య మండిపడ్డారు. సోమవారం రాజకీయ నేతలతో ఎస్‌ఈసీ అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఎన్నికల నిర్వహణపై నేతల అభిప్రాయాలు తెలుసుకున్నారు. తెదేపా తరఫున వర్లరామయ్య సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కుబడిగా సమావేశం ఏర్పాటు చేసినట్లు అనిపిస్తోందని విమర్శించారు.

‘మా నుంచి సమస్యలు, సూచనలు తీసుకోవాలని కోరాం. ప్రభుత్వం భయభ్రాంతులకు గురిచేస్తోందని ఎస్‌ఈసీకి తెలిపాం. ఇటీవల జరిగిన నాలుగు దఫాల పంచాయతీ ఎన్నికల్లో దౌర్జన్యాలు, దాడులు జరిగాయి. దాడులపై వివరించాలని ప్రయత్నిస్తే నిరాకరించారు. రీకౌంటింగ్‌పై ప్రశ్నిస్తే అడగకూడదని ఎస్‌ఈసీ తెలిపారు. ఎన్నికల్లో జరిగిన అక్రమాలపై చర్యలు తీసుకోవాలని కోరాం. ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నిస్తే సమాధానం లేదు. మాట్లాడేందుకు మాకు 5 నిమిషాలే అవకాశమిచ్చారు. ఎస్‌ఈసీ చిత్తశుద్ధితో వ్యవహరించాలని తెదేపా తరఫున కోరాం. ఎస్‌ఈసీపై మాకు అనుమానాలు వస్తున్నాయి. ఎస్ఈసీ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు’ అని వర్లరామయ్య ఆరోపించారు.

మొబైల్‌ ఫోన్ల డిపాజిట్‌పై అభ్యంతరం :వైకాపా
మున్సిపల్‌ ఎన్నికలను ప్రశాంతంగా జరిగేలా చూడాలని ఎస్‌ఈసీని కోరినట్లు సమావేశంలో పాల్గొన్న వైకాపా తెలిపింది. వాలంటీర్లు మొబైల్‌ ఫోన్లు డిపాజిట్‌ చేయాలన్న ఆదేశాలపై అభ్యంతరాలు తెలిపినట్లు ఆ పార్టీ నేత నారాయణమూర్తి చెప్పారు. వాలంటీర్ల హక్కులను కాపాడాలని కోరినట్లు తెలిపారు. నిబంధనల పేరుతో వాలంటీర్ల వ్యవస్థను నిలుపుదల చేయవద్దని కోరినట్లు వైకాపా నేత చెప్పారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని