Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

తాజా వార్తలు

Published : 25/11/2021 17:04 IST

Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. ధాన్యం సేకరణలో తెరాస వైఖరి సరిగా లేదు: టికాయత్‌

కార్పొరేట్ల లబ్ధి కోసమే మోదీ ప్రభుత్వం తాపత్రయపడుతోందని కిసాన్‌ సంయుక్త మోర్చా నాయకుడు రాకేశ్‌ టికాయత్‌ అన్నారు. ఇందిరాపార్కులో చేపట్టిన రైతు సంఘాల మహాధర్నాలో టికాయత్‌ మాట్లాడారు. ‘‘మన అందరి భాష వేరైనా భావన ఒక్కటే. సాగు చట్టాల రద్దు కోమమే మా పోరాటం కాదు. విత్తన బిల్లు తేకుండా ప్రైవేటు కంపెనీలకు కొమ్ముకాస్తున్నారు. ధాన్యం సేకరణలో తెరాస సర్కారు వైఖరి సరిగా లేదు. రైతు ఉద్యమంపై తెరాస వైఖరిని స్పష్టంగా ప్రకటించాలి’’ అని పేర్కొన్నారు. 

2. ఏపీ సినిమా టికెట్ల అంశంపై చిరు అభ్యర్థన

సినిమా టికెట్ల అంశంలో ఏపీ ప్రభుత్వం పునరాలోచన చేయాలని ప్రముఖ నటుడు చిరంజీవి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. ‘‘పరిశ్రమ కోరిన విధంగా పారదర్శకత కోసం ఆన్‌లైన్‌ టిక్కెటింగ్‌ బిల్‌ ప్రవేశ పెట్టడం హర్షించదగ్గ విషయం. టికెట్‌ ధరలను దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉన్న విధంగా నిర్ణయిస్తే పరిశ్రమకూ మేలు జరుగుతుంది’’ అని చిరంజీవి పేర్కొన్నారు.

జూ.ఎన్టీఆర్‌ మమ్మల్ని కంట్రోల్‌ చేయడం ఏంటి: కొడాలి నాని

3. ఆరోగ్యశ్రీ వార్షిక పరిమితి రూ.5 లక్షలకు పెంచాం: సీఎం జగన్‌

ఏపీతో పాటు ఇతర రాష్ట్రాల్లోని 130 సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చి పేదలకు వైద్య సేవలు అందిస్తున్నామని ఏపీ సీఎం జగన్‌ తెలిపారు. గురువారం శాసనసభలో ఆయన మాట్లాడుతూ... మనిషి ప్రాణానికి విలువనిచ్చే ప్రభుత్వమిదని స్పష్టం చేశారు. ఆరోగ్యశ్రీ వార్షిక పరిమితి రూ.5లక్షలకు పెంచామని తెలిపారు.

4. దిశ కమిటీ అధికారులపై కిషన్‌రెడ్డి ఆగ్రహం

హైదరాబాద్ జిల్లా దిశ కమిటీ సమావేశానికి కలెక్టర్, జీహెచ్ఎంసీ కమిషనర్ హాజరు కాకపోవడంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బేగంపేట టూరిజం ప్లాజాలో నిర్వహించిన జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశానికి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలు తీరుపై చర్చించే క్రమంలో సమాధానం చెప్పే అధికారులు లేకపోవడంతో సమావేశం ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. 

5. పంచ్‌ ప్రభాకర్‌ అరెస్టుకు వారెంట్‌ తీసుకున్నాం: సీబీఐ

జడ్జిలపై అనుచిత వ్యాఖ్యల కేసులో అఫిడవిట్‌ను సీబీఐ పిటిషనర్లకు పంపింది. ఇప్పటికే దీనిపై హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది. ఈ కేసులో పంచ్‌ ప్రభాకర్‌పై  నవంబరు 1న లుకౌట్‌ నోటీసులు జారీ చేశామని సీబీఐ తెలిపింది.  పంచ్‌ ప్రభాకర్‌ అరెస్టుకు నవంబరు 8న వారెంట్‌ తీసుకున్నామని పేర్కొంది. ప్రభాకర్‌ అరెస్టుకు సహకరించాలని  ఈ నెల 9న ఇంటర్‌ పోల్‌కు  విజ్ఞప్తి చేసినట్లు అఫిడవిట్‌లో వెల్లడించింది.

6. ‘వరద నష్టం అంచనాపై ప్రభుత్వానివి కాకి లెక్కలు’

ఇటీవల కురిసిన వర్షాలు, వరదల వల్ల కడప జిల్లాలో తీవ్ర నష్టం జరిగితే సీఎం జగన్‌ పట్టించుకోవడం లేదని జనసేన నేత నాదెండ్ల మనోహర్‌ మండిపడ్డారు. పంట దెబ్బతిని రైతులు అల్లాడుతుంటే కనీసం వారిని ఓదార్చడం లేదని ఆక్షేపించారు. క్షేత్రస్థాయిలో యంత్రాగం సక్రమంగా పని చేయడం లేదని ఆయన ఆరోపించారు. తిరుపతిలో మీడియాతో ఆయన మాట్లాడారు.

7. మమతపై పొగడ్త.. కేంద్రంపై తెగడ్త..!
మోదీ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందంటూ భాజపా నేత సుబ్రహ్మణ్య స్వామి విమర్శలు చేశారు. ఆర్థిక వ్యవస్థ నుంచి అంతర్గత భద్రత వరకు ప్రతి విషయంలోనూ ప్రస్తుత ప్రభుత్వం విఫలమైందని ట్విటర్ వేదికగా ఎండగట్టారు. తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీని కలిసి, ఆమెను ప్రశంసించిన మరుసటి రోజే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

8. ఆసియాలోనే అతిపెద్ద ఎయిర్‌పోర్టుకు.. మోదీ శంకుస్థాపన

ఆసియాలోనే అతిపెద్ద ఎయిర్‌పోర్టు నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు శ్రీకారం చుట్టారు. ఉత్తరప్రదేశ్‌లోని గౌతమ బుద్ధ నగర్‌ జిల్లా జెవెర్‌ ప్రాంతంలో నిర్మించనున్న నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రధాని గురువారం శంకుస్థాపన చేశారు. శంకుస్థాపనకు ముందు ఎయిర్‌పోర్టు డిజైన్‌ విశేషాలను మోదీకి.. నిర్మాణ సంస్థ ప్రతినిధులు వివరించారు.

9. నవాబ్‌ మాలిక్‌వి దురుద్దేశ వ్యాఖ్యలే..! బాంబే హైకోర్టు

ఎన్‌సీబీ అధికారి సమీర్‌ వాంఖడేపై ఇకపై ఎటువంటి వ్యాఖ్యలు చేయబోనని బాంబే హైకోర్టుకు మహారాష్ట్ర మంత్రి నవాబ్‌ మాలిక్‌ హామీ ఇచ్చారు. తన కుటుంబంపై బహిరంగ విమర్శలు చేస్తోన్న మంత్రి నవాబ్‌ మాలిక్‌ను నిలువరించాలని వాంఖడే తండ్రి వేసిన పిటిషన్‌నుబాంబే హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా మాలిక్‌ తీరును తప్పుబట్టిన న్యాయస్థానం.. దురుద్దేశంతోనే ఆయన బహిరంగ వ్యాఖ్యలు, ట్వీట్లు చేస్తున్నట్లు స్పష్టమవుతోందని అభిప్రాయపడింది.

10. ముగిసిన తొలి రోజు ఆట.. మూడు అర్ధశతకాలు నమోదు

భారత్, న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌ మొదటి రోజు ఆట మరో ఆరు ఓవర్లు మిగిలి ఉండగానే ముగిసింది. టాస్‌ నెగ్గిన టీమ్‌ఇండియా సారథి అజింక్య రహానె బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. దీంతో తొలి రోజు ఆట ముగిసేసమయానికి టీమ్‌ఇండియా నాలుగు వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది.  బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (75నాటౌట్‌), శుభ్‌మన్‌ గిల్ (52‌), జడేజా (50 నాటౌట్) రాణించారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని