Actress: విమానంలో నటితో అసభ్య ప్రవర్తన.. వ్యాపారవేత్తపై కేసు

తాజా వార్తలు

Published : 21/10/2021 01:36 IST

Actress: విమానంలో నటితో అసభ్య ప్రవర్తన.. వ్యాపారవేత్తపై కేసు

ముంబయి: టెలివిజన్‌ నటితో ఓ వ్యాపారవేత్త అసభ్యంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నటి ఫిర్యాదుతో సదరు వ్యాపారవేత్తను అదుపులోకి తీసుకున్న పోలీసులు బుధవారం అతడిని కోర్టులో హాజరుపరిచారు. పోలీసుల వివరాల ప్రకారం.. టెలివిజన్‌ ఇండస్ట్రీకి చెందిన ఓ నటి అక్టోబర్‌ 3న విమానంలో దిల్లీ నుంచి ముంబయి వెళ్లింది. విమానం ముంబయి విమానాశ్రయంలో ల్యాండ్‌ అవడంతో ఓవర్‌హెడ్‌ కంపార్ట్‌మెంట్‌లో ఉన్న తన బ్యాగు తీసుకునేందుకు నటి సీటులో నుంచి పైకి లేచింది. అయితే పక్క సీట్లో ఉన్న ఓ వ్యాపారవేత్త నటి నడుం పట్టుకొని ఒక్కసారిగా ఒళ్లోకి లాక్కున్నాడు. ఆమె ప్రతిఘటించడంతో బుకాయించాడు. పురుషుడు అనుకొని అలా చేశానని ఆమెకు క్షమాపణలు తెలిపాడు.

ఘటన అనంతరం ఇంటికి వెళ్లిన నటి జరిగిన తతంగాన్నంతా విమానయాన సంస్థకు మెయిల్‌ చేసింది. సదరు వ్యక్తి వివరాలు బహిర్గతం చేయాలని కోరింది. అయితే తాము అలా చేయలేమని.. విషయాన్ని పోలీసులకు తెలియజేయాలంటూ సంస్థ సూచించింది. దీంతో ఆమె అక్టోబర్‌ 4న ముంబయిలోని సహర్‌ పోలీసులను ఆశ్రయించింది. నటి ఫిర్యాదు ఆధారంగా ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన సదరు వ్యాపారవేత్తను పోలీసులు ఈనెల 14న అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని బుధవారం కోర్టులో హాజరుపరుచగా.. మరో 24 గంటలపాటు కోర్టు కస్టడీ విధించింది.

ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలని నటిపై ఒత్తిడి

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బాధిత నటి విమానంలో జరిగిన విషయాలను బహిర్గతం చేసింది. నిందితుడి చర్యతో ఎంతో భయాందోళనకు గురైనట్లు తెలిపింది. ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలని వ్యాపారవేత్త కుటుంబసభ్యులు తనపై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు వాపోయింది. ‘ఆ ఘటనతో వణికిపోయాను. అతడి భార్య, మరో వ్యక్తి నా ఇంటికి వచ్చి ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని నన్ను అడిగారు. వారికి నా ఇంటి అడ్రస్‌ కూడా తెలిసిపోయింది. మళ్లీ ఎవరైనా నా దగ్గరకు వస్తారేమోనని భయంగా ఉంది’ అంటూ వాపోయింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని