కోర్టులద్వారా స్టీల్‌ప్లాంట్‌ను రక్షించుకుంటాం: వడ్డే
close

తాజా వార్తలు

Published : 19/04/2021 01:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కోర్టులద్వారా స్టీల్‌ప్లాంట్‌ను రక్షించుకుంటాం: వడ్డే

విశాఖ: లాభనష్టాలతో సంబంధం లేకుండా విశాఖ ఉక్కు కర్మాగారాన్ని విక్రయిస్తామంటే ఊరుకోబోమని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు అన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ, సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆర్కే బీచ్‌లో నిర్వహించిన రైతు, కార్మిక శంఖారావంలో ఆయన మాట్లాడారు.  ప్రభుత్వ రంగ సంస్థలంటే ప్రజా సంపద అని.. వాటిని పెట్టుబడిదారులకు ఎలా ఇస్తారని వడ్డే నిలదీశారు. న్యాయస్థానాల ద్వారా స్టీల్‌ప్లాంట్‌ను రక్షించుకుంటామని చెప్పారు. 

కార్మిక సంఘం నేత రాజశేఖర్‌ మాట్లాడుతూ కన్నతల్లిలాంటి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని అమ్మేస్తే ఒప్పుకునేదే లేదన్నారు.  పరిశ్రమకు సొంతగనులు కేటాయించమని కోరినా ఇవ్వడం లేదని చెప్పారు. స్టీల్‌ప్లాంట్‌లో కేంద్రం పెట్టుబడి రూ.5వేల కోట్లు మాత్రమేననన్నారు. సభ ప్రారంభానికి ముందు బీచ్‌ రోడ్డులో భారీ ర్యాలీ నిర్వహించారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని