దివాళాంధ్రప్రదేశ్‌గా ఏపీ!: రఘురామకృష్ణరాజు
close

తాజా వార్తలు

Updated : 30/03/2021 17:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దివాళాంధ్రప్రదేశ్‌గా ఏపీ!: రఘురామకృష్ణరాజు

దిల్లీ: జగనన్న పేరుతో ఏపీ ప్రభుత్వం చేపట్టే పథకాలన్నీ బాదుడుగా మారే ప్రమాదముందని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు ఆందోళన వ్యక్తం చేశారు. త్వరలోనే రాష్ట్రం రుణాంధ్ర నుంచి దివాళాంధ్రగా మారే అవకాశముందని చెప్పారు. రాష్ట్ర పరిస్థితి ఓ వైపు దివాళాంధ్రప్రదేశ్‌గా మారుతుంటే సీఎం జగన్‌ తీరు నీరో చక్రవర్తిని తలపిస్తోందన్నారు. దిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఆర్డినెన్స్‌ ద్వారా బడ్జెట్‌ పెట్టిన పరిస్థితి ఏ రాష్ట్రంలోనూ లేదని.. భవిష్యత్తులో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారనుందన్నారు. మితిమీరిన అప్పులతో ఏపీ ఆర్థిక పరిస్థితి నడి సంద్రంలో నావలా తయారైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై అప్పులు కూడా పుట్టే పరిస్థితి ఉండదని హెచ్చరించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని రఘురామకృష్ణరాజు డిమాండ్‌ చేశారు. 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని