Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 176442
            [news_title_telugu_html] => 

ప్రైవేట్‌ విశ్వవిద్యాలయాల స్థాపనకు ప్రకటన

[news_title_telugu] => ప్రైవేట్‌ విశ్వవిద్యాలయాల స్థాపనకు ప్రకటన [news_title_english] => [news_short_description] => రాష్ట్రంలో ఏర్పాటు కానున్న ప్రైవేట్‌ విశ్వవిద్యాలయాల్లో 25 శాతం ప్రాంతీయ రిజర్వేషన్‌ ఉంటుంది. తెలంగాణలో రెండేళ్లు చదివిన విద్యార్థులు ఈకోటా కింద చేరేందుకు అర్హులు. లేనిపక్షంలో వారి తల్లిదండ్రులు ఇక్కడ జన్మించినా [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [news_sections] => ,27,26, ) )
ప్రైవేట్‌ విశ్వవిద్యాలయాల స్థాపనకు ప్రకటన - EENADU
close
ప్రైవేట్‌ విశ్వవిద్యాలయాల స్థాపనకు ప్రకటన

హెచ్‌ఎండీఏ పరిధిలో 20 ఎకరాలు.. ఇతర చోట్ల 30 ఎకరాలు స్థలం తప్పనిసరి
దరఖాస్తుల పరిశీలనకు నిపుణుల కమిటీ

రాష్ట్రంలో ఏర్పాటు కానున్న ప్రైవేట్‌ విశ్వవిద్యాలయాల్లో 25 శాతం ప్రాంతీయ రిజర్వేషన్‌ ఉంటుంది. తెలంగాణలో రెండేళ్లు చదివిన విద్యార్థులు ఈకోటా కింద చేరేందుకు అర్హులు. లేనిపక్షంలో వారి తల్లిదండ్రులు ఇక్కడ జన్మించినా లేదా కనీసం రెండేళ్లు రాష్ట్రంలో పనిచేసినా వారి పిల్లలు ప్రాంతీయ రిజర్వేషన్‌ కింద సీట్లు పొందవచ్చు. ఇంకా ఈ కోటా కింద సీట్లు మిగిలితే వాటిని ఓపెన్‌ కోటాలో చేర్చి భర్తీ చేస్తారు.

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రైవేట్‌ వర్సిటీల ఏర్పాటుకు రాష్ట్ర విద్యాశాఖ ప్రకటన విడుదల చేసింది. దీనిపై ప్రభుత్వం మంగళవారం జీఓ జారీ చేసింది. రాష్ట్రంలో ప్రైవేట్‌ విశ్వవిద్యాలయాల చట్టం జులై 15 నుంచి అమలులోకి వచ్చినట్లు గత నెలలో ప్రభుత్వం జీఓ విడుదల చేసినప్పటికీ మార్గదర్శకాలు విడుదలవ్వలేదు. తాజాగా నోటిఫికేషన్‌లో పలు మార్గదర్శకాలను, నిబంధనలను జీఓలో పేర్కొంది.

ముఖ్యాంశాలు
* వర్సిటీ ఏర్పాటు చేయాలంటే హెచ్‌ఎండీఏ పరిధిలో 20 ఎకరాల విస్తీర్ణం ఉండాలి. ఇతర ప్రాంతాల్లో 30 ఎకరాల విస్తీర్ణం తప్పనిసరి. స్థలాన్ని సొసైటీ పేరిట రిజిస్టర్‌ చేసి ఉండాలి. రూ.10 కోట్లు కార్ఫస్‌ ఫండ్‌, భవనాల నిర్మాణం, మౌలిక వసతుల కల్పన, ప్రాంగణాభివృద్ధికి రూ.30 కోట్ల నిధులను ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ రూపంలో చూపాలి.
* వర్సిటీ ఏర్పాటు చేయాలనున్న వారు తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి వెబ్‌సైట్‌ నుంచి దరఖాస్తును డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. రూ.50 వేలు చెల్లించాలి. దరఖాస్తు సమర్పణ సమయంలో రూ.10 లక్షలు చెల్లించాలి. వాటిని తిరిగి ఇవ్వరు.
* యాజమాన్యాలు సమర్పించే ప్రాజెక్టు నివేదిక పరిశీలనకు, ప్రభుత్వానికి సిఫార్సు చేయడానికి విద్యాశాఖ కార్యదర్శిని ఎక్స్‌ అఫిషియో ఛైర్మన్‌గా, కళాశాల విద్యాశాఖ కమిషనర్‌ సభ్య కార్యదర్శిగా, ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌, జేఎన్‌టీయూహెచ్‌, ఓయూ ఉపకులపతులు సభ్యులుగా నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తారు.
* దరఖాస్తు అందిన 60 రోజులలోపు కమిటీ తన అభిప్రాయాన్ని ప్రభుత్వానికి తెలియజేస్తుంది. కమిటీ సిఫార్సు చేసిన 30 రోజులలోపు ప్రభుత్వం అనుమతివ్వాలా? లేదా? నిర్ణయం తీసుకుంటుంది.
* వర్సిటీ ఏర్పాటైన తర్వాత నెల రోజుల్లో వర్సిటీ పేరిట రూ.10 కోట్ల ధార్మిక నిధి(ఎండోమెంట్‌ ఫండ్‌) ఏర్పాటు చేయాలి. దాన్ని బ్యాంకులో వర్సిటీ, కళాశాల విద్యాశాఖ కమిషనర్‌ సంయుక్త ఖాతా పేరిట ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేయాలి.
* చట్టంలోని నిబంధనలు పాటించకుంటే రాష్ట్ర ప్రభుత్వం కార్యదర్శి, ఆపై స్థాయి వారిని విచారణాధికారిగా నియమిస్తుంది. అంతేకాదు చట్టసభల నిర్ణయం మేరకు వర్సిటీని రద్దు చేస్తారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.