close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
సెప్టెంబరు 1 నుంచి బడులు

నవంబరు 14లోగా దశల వారీగా పాఠశాలల ప్రారంభం
తుది నిర్ణయం రాష్ట్రాలదే...
మార్గదర్శకాల జారీకి కేంద్రం కసరత్తు

ఈనాడు, దిల్లీ: కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా మూతపడిన పాఠశాలలు, ఇతర విద్యా సంస్థలను సెప్టెంబరు 1 నుంచి నవంబరు 14 మధ్య దశల వారీగా పునః ప్రారంభించేలా కేంద్రం కసరత్తు చేస్తోంది. పలు దేశాలు విద్యా సంస్థలను తెరిచిన తీరుపై అధ్యయనం సాగించిన మీదట, ఈ విషయమై మార్గదర్శకాలను రూపొందిస్తోంది. అయితే- ఈ విషయంలో స్థానిక పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలే తుది నిర్ణయం తీసుకోవాలని కేంద్రం సూచించనున్నట్టు సంబంధిత అధికారులు తెలిపారు. అన్‌లాక్‌ ప్రక్రియలో భాగంగా కేంద్రం ఈ నెలాఖరు నాటికి విస్తృతస్థాయి ‘స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్స్‌’ను విడుదల చేయనుంది. విద్యా సంస్థలను తెరిచే విషయమై వీటిలో కూలంకషంగా వివరించనుంది. ‘‘లాక్‌డౌన్‌ ఎత్తివేత క్రమంలో ఆగస్టు 31 తర్వాత అనుసరించాల్సిన విధానాలపై కేంద్రం మార్గదర్శకాలను జారీ చేయనుంది. ముఖ్యంగా విద్యార్థులు ఎప్పుడు, ఏ విధానంలో తరగతులకు హాజరుకావచ్చన్నది రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయించాలి. ఈ విషయంలో కొవిడ్‌-19 కేసుల తీరును పరిశీలించడంతో పాటు పాఠశాల నిర్వాహకులు, తల్లిదండ్రుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. బోధన సిబ్బంది, విద్యార్థుల్లో 33% సామర్థ్యంతో బడులు షిఫ్టుల వారీగా తరగతులు నడపాలని, తరగతి గదుల్లో విద్యార్థులు 2-3 గంటలు మాత్రమే ఉండేలా చూడాలని కేంద్రం సూచనలివ్వనుంది. మొదటి షిఫ్టు ఉదయం 8 నుంచి 11 గంటల వరకూ; రెండో షిఫ్టును 12 నుంచి 3 గంటల వరకూ నిర్వహించాలి. రెండు షిఫ్టుల మధ్యనుండే సమయంలో తరగతి గదులను శానిటైజ్‌ చేయాలి. ప్రస్తుతం మాత్రం 10 నుంచి 12వ తరగతుల విద్యార్థులకే ప్రత్యక్ష తరగతులు నిర్వహించాలి. చిన్నారులకు మాత్రం ఆన్‌లైన్‌ తరగతులనే కొనసాగించాలి. సెక్షన్ల వారీగా విద్యార్థులు నిర్దిష్ట రోజుల్లో నేరుగా బడులకు వెళ్లాల్సి ఉంటుంది’’ అని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.