close

తాజా వార్తలు

ధోనీ రిటైర్మెంట్‌ తర్వాత ఏం చేస్తాడో తెలుసా?

 సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ ఇండియా మాజీ సారథి, వికెట్‌ కీపర్‌ మహేంద్రసింగ్‌ ధోనీ రిటైర్మెంట్‌ విషయం ఇప్పటికే అనేకసార్లు చర్చనియాంశమైంది. తాజాగా అతడికి సంబంధించిన ఓ వీడియో ఈ చర్చకు మరింత ఊతమిస్తూ ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోంది. అందులో ధోనీ మాట్లాడుతూ.. తన గురించి ఎవరికీ తెలియని ఓ విషయాన్ని వెల్లడించాడు. అదేంటంటే తాను స్వయంగా గీసిన పెయింటింగ్స్‌ను అభిమానులకు పరిచయం చేశాడు.

ధోనీ ఆ వీడియోలో  మాట్లాడుతూ ఇలా చెప్పుకొచ్చాడు. ‘మీ అందరికీ తెలియని ఓ విషయం చెప్పాలనుకుంటున్నా. నేను పాఠశాలలో చదువుకునే రోజుల్లోనే ఒక కళాకారుడిని కావాలనుకున్నా. ఇప్పటికే క్రికెట్‌ ఆడాను. ఇప్పుడు నా కల సాకారం చేసుకునే సమయం ఆసన్నమైంది. కాబట్టి నేను గీసిన కొన్ని పెయింటింగ్స్‌ మీ ముందుకు తెచ్చాను’ అని వివరించాడు. కాగా, ధోనీ చూపించిన మూడు పెయింటింగ్స్‌లో మొదటిది అద్భుతమైన ల్యాండ్‌స్కేప్‌. రెండోది భవిష్యత్‌లో రవాణాకి ఉపయోగించే ఓ విమాన చిత్రపటం. ఇక మూడోది చెన్నై సూపర్‌ కింగ్స్ తరఫున తాను బ్యాటింగ్‌ చేసే నమూనా చిత్రం. ఈ మూడూ చూడటానికి ఎంతో బాగున్నాయి.  ఇదిలా ఉండగా.. 2014లో టెస్టు క్రికెట్‌ నుంచి తప్పుకున్న ధోనీ రాబోయే ప్రపంచకప్‌ తర్వాత వన్డే క్రికెట్‌కూ రిటైర్మెంట్‌ ప్రకటించే అవకాశముందనే చర్చ అభిమానుల్లో జరుగుతోంది. ఇప్పటిదాకా 341 వన్డేలు ఆడిన ధోనీ 50.72 సగటుతో పది శతకాలు, 71 అర్థశతకాలు సాధించాడు. మరో పది రోజుల్లో ప్రారంభమయ్యే ప్రపంచకప్‌లో ఎలా రాణిస్తాడో వేచి చూడాలి.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.