close

తాజా వార్తలు

పవన్‌ సినిమాలో చిట్టితల్లే ఆ జర్నలిస్ట్‌

హైదరాబాద్‌: పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘బంగారం’. 2006లో విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందనలు లభించాయి. ఈ సినిమాలో మీరాచోప్రా చెల్లిగా నటించి ప్రేక్షకుల మన్ననలు అందుకుంది బాలనటి సనూష. ‘బంగారం’లో పవన్‌ ముద్దుగా చిట్టితల్లి అని పిలిచే ఈ కేరళ చిన్నారి ఆ తర్వాత తెలుగు సినిమాలకు కొంతవరకూ దూరంగానే ఉన్నారు. అయితే తాజాగా సనూష తెలుగు తెరపై మరోసారి సందడి చేశారు. ఏ సినిమాలో అని ఆలోచిస్తున్నారు. అదేనండి నేచురల్ స్టార్‌ నాని కథానాయకుడిగా ఈ ఏడాది విడుదలైన ‘జెర్సీ’ చిత్రంలో సనూష నటించారు. ఈ సినిమాలో కీలకమైన జర్నలిస్ట్‌ పాత్రలో ఆమె ఒదిగిపోయారు. ‘జెర్సీ’ చిత్రంలో ఆమె నటనను చూసిన చాలామంది సినీ అభిమానులు ఈ నటి ఎవరబ్బా అని సోషల్‌మీడియాలో అన్వేషించారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.