close

తాజా వార్తలు

ముద్దు పెడతానంటే వద్దని చెప్పా!

హైదరాబాద్‌: వ్యాఖ్యాతగా బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి శ్రీముఖి. గతేడాది బిగ్‌బాస్‌ ఫైనల్‌ వరకూ వచ్చి రన్నరప్‌గా నిలిచింది. అప్పుడప్పుడూ వెండితెరపై మెరుస్తున్న శ్రీముఖి సామాజిక మాధ్యమాల వేదికగా ఎంతో చురుగ్గా ఉంటుంది. కాగా, ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులతో చాట్‌ చేసింది. కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది.

ఎవరైనా స్నేహితుడికి అబద్ధం చెప్పారా?

శ్రీముఖి: సీరియస్‌గా ఎప్పుడూ చెప్పలేదు. సరదాగా అబద్ధాలు చాలా సార్లు చెప్పా. 

దుస్తులు లేకుండా ఈత కొట్టారా?

శ్రీముఖి: ఎప్పుడూ ఈత కొట్టలేదు. (నవ్వులు)

పొరుగింటి వారిపై ఎప్పుడైనా నిఘా పెట్టారా?

శ్రీముఖి: అలా ఎప్పుడూ చేయలేదు.

తల్లిదండ్రులకు అబద్ధాలు చెప్పారా?

శ్రీముఖి: అప్పుడప్పుడు చిన్న చిన్న అబద్ధాలు చెప్పాను. 

ఎవరినైనా మోసగించారా?

శ్రీముఖి: లేదు

మీ వయసు విషయంలో అబద్ధం చెప్పారా?

శ్రీముఖి: ఎప్పటికీ అలా చెప్పను. 

లవ్‌లో ఉన్నారా?

శ్రీముఖి:  ఒకప్పుడు. ముసి ముసి నవ్వులు

స్నేహితుడిని కలవడాన్ని తప్పించుకోవడానికి అబద్ధాలు చెప్పారా?

శ్రీముఖి: అవును.. గతంలో కొన్ని సందర్భాల్లో అలా చెప్పా.

ఎవరైనా ముద్దు పెడతానంటే వద్దని చెప్పారా?

శ్రీముఖి: అవును. వద్దని చెప్పాను (నవ్వులు) 

పరీక్షల్లో ఎప్పుడైనా మోసం చేశారా?

శ్రీముఖి: చాలాసార్లు చేశాను. స్కూల్లో చేయలేదు. కాలేజ్‌లో చాలాసార్లు చేశా. 

ఎదుటివారి అనుమతి లేకుండా వారి ఫోన్‌ చూశారా?

శ్రీముఖి: అవును చూశాను. చెడ్డ అలవాటు కానీ, చూడాల్సి వచ్చింది. 

స్నేహితురాలి సోదరుడిపై ఎప్పుడైనా క్రష్‌ కలిగిందా?

శ్రీముఖి: లేదు. 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.