close

తాజా వార్తలు

మళ్లీ మల్టీస్టారర్‌ చిత్రమా?

గ్ర దర్శకుడు రాజమౌళికి కథల కొరతే ఉండదు. ఆయన ఇంట్లోనే బోలెడన్ని కథలు సిద్ధమైపోతుంటాయి. రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్‌ రాసిన కథలు బాలీవుడ్‌లోనూ సత్తా చాటుతుంటాయి. ఆయనే రాజమౌళి సినిమాల కోసం కథలు సిద్ధం చేస్తుంటారు. తదుపరి ఏ కథతో సినిమా చేయాలనే విషయంలో ముందుగానే ఒక నిర్ణయానికొచ్చే అవకాశం రాజమౌళికి ఉంది. అలా ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ తర్వాత సినిమాకి కూడా ఇప్పటికే కథ సిద్ధమైందని, అది కూడా మల్టీస్టారర్‌ చిత్రంగానే రూపొందే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ‘బాహుబలి’ తర్వాత రాజమౌళి సినిమాల స్థాయి    పెరిగిపోయింది. ఆయన ప్రతి సినిమా పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందాల్సిందే. తదుపరి కూడా తెలుగు కథానాయకులే  నటించబోతున్నారని సమాచారం. వచ్చే సంక్రాంతికి  ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ చిత్రం రానుంది. ఆ తర్వాతే  రాజమౌళి కొత్త సినిమాపై ఓ స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
besttaxfiler
Saket Pranamam
VITEEE 2020
dr madhu
HITS2020

Panch Pataka

దేవతార్చన