ఏపీలో పాజిటివిటీ రేటు ఆందోళనకరం!
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఏపీలో పాజిటివిటీ రేటు ఆందోళనకరం!

వారం వృద్ధిరేటు అత్యధికంగా 30% వరకు ఉంది
కేంద్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ వ్యాఖ్య

ఈనాడు, దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో పాజిటివిటీ రేటు ఏప్రిల్‌ తొలినాళ్ల నుంచి పెరిగిపోతుండటంపై కేంద్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. వారం వృద్ధిరేటు అత్యధికంగా 30% వరకు ఉందని, చిత్తూరు, తూర్పుగోదావరి, గుంటూరు, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో పరిస్థితులు గంభీరంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఉత్తర్‌ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌లోని కొవిడ్‌ స్థితిగతులపై శనివారం ఆయన వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జాతీయ అంటువ్యాధుల నియంత్రణ కేంద్రం డైరెక్టర్‌ సుజీత్‌ కె.సింగ్‌ ఈ రాష్ట్రాల్లోని వ్యాధి సంక్రమణ తీరు గురించి ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ఇప్పటివరకు 18 కోట్ల డోసులు ప్రజలకు అందించామని, జులై చివరి నాటికి మరో 33.6 కోట్ల డోసులు అందిస్తామని ప్రకటించారు. స్పుత్నిక్‌ వ్యాక్సిన్‌కు ఇప్పటికే అనుమతులు ఇచ్చామని, కొత్తగా జైడూస్‌ క్యాడిలా, సీరం ఇన్‌స్టిట్యూట్‌ నోవావ్యాక్స్‌, భారత్‌ బయోటెక్‌ నాసల్‌ వ్యాక్సిన్‌, జెనోవా ఎంఆర్‌ఎన్‌ఏ వ్యాక్సిన్లు కలిపి ఆగస్టు-డిసెంబర్‌ మధ్యకాలంలో 216 కోట్ల డోసులు ఉత్పత్తి అవుతాయని చెప్పారు.

కేసుల పెరుగుదలలో ఏపీకి 2వ స్థానం  
ప్రస్తుతం దేశంలో నిరంతరం కొవిడ్‌ కేసుల పెరుగుదల కనిపిస్తున్న 8 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ రెండో స్థానంలో ఉంది. కేంద్ర వైద్యఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌అగర్వాల్‌ శనివారం విలేకర్ల సమావేశంలో విడుదల చేసిన డేటా ఈ విషయాన్ని వెల్లడించింది. ఇందులో తమిళనాడు తర్వాతి స్థానంలో ఆంధ్రప్రదేశ్‌ నిలిచింది. గత రెండువారాలుగా నిరంతరం కేసులు పెరుగుతున్న జిల్లాలు 15 ఉండగా అందులో ఆరో స్థానంలో తూర్పుగోదావరి, పదో స్థానంలో విశాఖపట్నం, 12వ స్థానంలో కడప జిల్లాలు ఉన్నాయి. క్రియాశీలక కేసుల పరంగా ఆంధ్రప్రదేశ్‌ 5వ స్థానం(2,03,787)లో నిలిచింది. దేశంలోని 516 జిల్లాల్లో 10%కి మించి పాజిటివిటీ రేటు ఉండగా, వాటిలో ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాలున్నాయి.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని