కొత్తగా 1,771 కరోనా కేసులు
close

ప్రధానాంశాలు

కొత్తగా 1,771 కరోనా కేసులు

మరో 13 మంది మృతి

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా శనివారం 1,20,525 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 1,771 కేసులు నమోదయ్యాయి. మొత్తం బాధితుల సంఖ్య 6,02,089కి చేరింది. చికిత్స పొందుతూ మరో 13 మంది చనిపోవడంతో ఇప్పటివరకు మరణాల సంఖ్య 3,469 చేరుకుంది. తాజాగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 171, నల్గొండ జిల్లాలో 157, ఖమ్మంలో 149, కొత్తగూడెంలో 107, మేడ్చల్‌ జిల్లాలో 104 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.
1,96,887 మందికి తొలి డోసు..: రాష్ట్రంలో శుక్రవారం 1,96,887 మందికి తొలిడోసు, 12,487 మందికి రెండో డోసు కరోనా టీకాలు ఇచ్చారు. దీంతో తొలిడోసు టీకాలు పూర్తిచేసుకున్నవారి సంఖ్య 61,13,416కి, రెండు డోసులూ ముగిసిన వారి సంఖ్య 14,95,199కి చేరింది. 

ఏపీలో కొత్తగా 6,952 పాజిటివ్‌లు.. 58 మంది మృతి

ఈనాడు, అమరావతి: ఏపీలో కొత్తగా 6,952 కరోనా కేసులు నమోదయ్యాయి. శనివారం ఉదయంతో గడిచిన 24 గంటల్లో 1,08,616 నమూనాలు పరీక్షించగా ఈ కేసులు వెలుగు చూశాయి. ఒక్క రోజు వ్యవధిలో 58 మంది కరోనాతో చనిపోయారు.Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని