కొవిడ్ అవినీతిపై 40వేలకు పైగా ఫిర్యాదులు!

తాజా వార్తలు

Updated : 07/12/2020 15:53 IST

కొవిడ్ అవినీతిపై 40వేలకు పైగా ఫిర్యాదులు!

దిల్లీ: కొవిడ్-19కి సంబంధించిన అవినీతిపై కేంద్రానికి 40 వేలకు పైగా ఫిర్యాదులు అందాయని సంబంధిత అధికారులు మీడియాకు వెల్లడించారు. దేశంలో కరోనా వైరస్ ఉనికి ప్రారంభమైన దగ్గరి నుంచి..మహమ్మారి వల్ల ప్రజలకు ఎదురయ్యే సమస్యలను పరిష్కరించే లక్ష్యంతో కేంద్రం ఏప్రిల్‌లో ఒక ప్రత్యేక పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.  దానికింద ఇప్పటివరకు 1,67,000పైగా ఫిర్యాదులు అందాయని, వాటిలో 1,50,000 పైగా పరిష్కరించామని అధికారులు వెల్లడించారు. వాటిని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ అడ్మినిస్ట్రిటేటివ్ రిఫార్మ్స్‌ అండ్ పబ్లిక్ గ్రీవెన్సెస్ వెబ్‌సైట్‌లో పరిశీలించవచ్చని తెలిపారు.

కొవిడ్-19కి సంబంధించిన కేసులను పరిష్కరించే సమయంలో లంచం, నిధుల దుర్వినియోగం, ప్రభుత్వ అధికారుల వేధింపులు వంటివి ఆ ఫిర్యాదుల్లో ఉన్నాయి. ‘ప్రగతి(ప్రొ-యాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్‌లీ ఇంప్లిమెంటేషన్) సమావేశంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అవినీతి గురించి ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో, అవి ఎలా పరిష్కారం అవుతున్నాయో ప్రధాని తెలుసుకోవాలనుకున్నారు. పర్సన్, ప్రాసెస్‌, పాలసీ..ఇలా ఫిర్యాధుల స్వభావాన్ని కూడా ఆయన తెలుసుకోవాలనుకున్నారు’ అని అధికారులు వెల్లడించారు. ఆ ఫిర్యాదుల్లో ఎక్కువ భాగం వీసాల మంజూరు, కరోనా ఆంక్షల కారణంగా విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను తీసుకురావడం, అత్యవసర సేవలు లభ్యత, ఆసుపత్రుల్లో సౌకర్యాల లేమి, లాక్‌డౌన్‌కు కట్టుబడి ఉండకపోవడం, పీఎం ఫండ్‌కు విరాళం ఇవ్వడంలో అవరోధం వంటివి ఉన్నాయన్నారు. 

ఇవీ చదవండి:

4లక్షల దిగువకు క్రియాశీల కేసులు

ఆక్స్‌ఫర్డ్‌ టీకాకు అనుమతి ఇవ్వండి


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని