close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 13/07/2020 09:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

2021 నాటికి వ్యాక్సిన్‌ వచ్చేనా?

ప్యారిస్‌: ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభిస్తుండడంతో ప్రజలంతా వ్యాక్సిన్‌పైనే ఆశలు పెట్టుకున్నారు. ఎప్పుడు వస్తుందా అని వేయి కళ్లతో వేచి చూస్తున్నారు. ఈ తరుణంలో ఫ్రాన్స్‌కు చెందిన ఓ నిపుణుడు కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనాపై 100 శాతం సమర్థంగా పనిచేసే వ్యాక్సిన్‌ కనీసం 2021 నాటికైనా వచ్చే అవకాశాలు చాలా తక్కువేనని తెలిపారు. భౌతిక దూరాన్ని పాటించడం సహా వైరస్‌ కట్టడికి పాటించాల్సిన నియమాల్ని కఠినంగా అమలు చేయడం ఒక్కటే మార్గమని స్పష్టం చేశారు. 

‘‘వ్యాక్సిన్‌ తయారీ సంవత్సరాల ప్రక్రియ. అయితే, కరోనాపై పోరాడే టీకా కోసం భారీ ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ, 2021 నాటికి ప్రభావవంతమైన వ్యాక్సిన్‌ వస్తే అది ఆశ్చర్యమనే చెప్పాలి. పాక్షికంగా పనిచేసే టీకా రావొచ్చు. ఈ సంక్షోభం అంతానికి మనం ఇంకా చాలా దూరంలో ఉన్నాం. వైరస్‌తో సహజీవనం చేయాల్సిందే. మరోసారి లాక్‌డౌన్‌ అంటే కష్టమే. మన అలవాట్లు, జీవనశైలిలో మార్పులు చేసుకోవాల్సిందే’’ అని ప్రముఖ ఎపిడెమాలజిస్ట్‌ ఆర్నాడ్ ఫోంటానెట్ తెలిపారు. ప్రస్తుత కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోవడంపై ఫ్రాన్స్‌ ప్రభుత్వానికి సలహాలందిస్తున్న శాస్త్రవేత్తల బృందంలో ఆర్నాడ్‌ కీలక సభ్యుడు. 

జన సమూహాలు, సామాజిక కార్యక్రమాలు, విందులు, వినోదాలకు ఇంకొంత కాలం దూరంగా ఉండాల్సిందే అని ఆర్నాడ్‌ స్పష్టం చేశారు. ప్రజలు గుమిగూడే అవకాశం ఉన్న ప్రాంతాలే వైరస్‌ విస్ఫోటన కేంద్రాలుగా మారుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా క్రూయిజ్‌ నౌకలు, యుద్ధ నౌకలు, క్రీడా ప్రాంగణాలు, డిస్కోలు, జంతువధశాలలు, వలస కార్మికుల పునరావాస కేంద్రాలు, ప్రార్థనా మందిరాలు వైరస్‌ వ్యాప్తికి కేంద్రాలుగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అలాగే క్లోజ్డ్‌ ఏరియాల్లో సైతం జాగ్రత్తగా ఉండాలని అప్రమత్తం చేశారు.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.