close

తాజా వార్తలు

జపాన్‌ ప్రధాని రాకపై ‘క్యాబ్‌’ ఎఫెక్ట్‌

దిల్లీ: పౌరసత్వ సవరణ బిల్లు(క్యాబ్‌)కు వ్యతిరేకంగా ఈశాన్య రాష్ట్రాల్లో ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. కాగా.. ఈ ఆందోళనలు విదేశీ నేతలు, ప్రతినిధుల భారత పర్యటనలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ఇప్పటికే బంగ్లాదేశ్‌ హోంమంత్రి, విదేశాంగ మంత్రులు తమ భారత పర్యటనలను రద్దు చేసుకున్నారు. తాజాగా జపాన్‌ ప్రధాని షింజో అబే కూడా తన పర్యటనను రద్దు చేసుకునే యోచనలో ఉన్నట్లు ఆ దేశ మీడియా వర్గాలు వెల్లడించాయి. 

షెడ్యూల్‌ ప్రకారం భారత్‌లో షింజో అబే పర్యటన ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. అసోం రాజధాని గువాహటి వేదికగా భారత ప్రధాని మోదీ.. షింజో అబే భేటీ కానున్నట్లు గతంలో అధికారులు వెల్లడించారు. అయితే తాజాగా పౌరసత్వ సవరణ బిల్లు కారణంగా అసోంలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. దీంతో అబే.. తన భారత పర్యటనపై పునరాలోచిస్తున్నారని, రద్దు చేసుకునే యోచనలో ఉన్నారని జపాన్‌కు చెందిన జిజి మీడియా కథనం పేర్కొంది. కాగా.. దీనిపై భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రవీశ్‌ కుమార్‌ స్పందిస్తూ.. అబే పర్యటన రద్దుపై తమకు ఎలాంటి సమాచారం రాలేదన్నారు. 

పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలతో ఈశాన్య రాష్ట్రం అసోం రణరంగాన్ని తలపించింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఆందోళనకారులను అడ్డుకునేందుకు పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. 


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.