కరోనా: అక్కడ ప్రతి 17సెకన్లకు ఒక మరణం

తాజా వార్తలు

Published : 20/11/2020 16:29 IST

కరోనా: అక్కడ ప్రతి 17సెకన్లకు ఒక మరణం

హెచ్చరించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ

బ్రసెల్స్‌: కరోనావైరస్ ప్రారంభ దశలో తీవ్ర అల్లకల్లోలానికి గురైన ఐరోపా..మరోసారి అదే పరిస్థితిని ఎదుర్కొంటోంది. యూరోపియన్‌ యూనియన్‌లో ప్రతి 17 సెకన్లకు ఒక వ్యక్తి మరణించడం తీవ్రతకు అద్దంపడుతోంది. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థలోని ఈయూ ప్రాంతీయ డైరెక్టర్ హాన్స్ క్లుగే ఆందోళన వ్యక్తం చేశారు.

‘ప్రపంచ వ్యాప్తంగా 28 శాతం కేసులు, 26 శాతం మరణాలు ఈ ప్రాంతంలోనే నమోదవుతున్నాయి. గతవారం 29వేల కేసులు వెలుగు చూడగా, ప్రతి 17 సెకన్లకు ఒక వ్యక్తి మరణిస్తున్నాడు’ అని హాన్స్‌ క్లుగే వెల్లడించారు. గతవారంలో మరణాలు 18 శాతం పెరిగాయని తెలిపారు. అయితే, వైరస్ వ్యాప్తిని నివారించడానికి అక్కడి ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతుండటంతో.. గత మూడు నెలల కాలంలో తొలిసారిగా ఈ వారం కరోనా కేసుల్లో తగ్గుదల కనిపించింది. తాజాగా వారం రోజుల్లో కొత్త కేసులు 10 శాతానికి తగ్గిన నేపథ్యంలో..యూకే, ఫ్రాన్స్, స్పెయిన్ వంటి తదితర ప్రభుత్వాలు విధించిన కఠిన లాక్‌డౌన్లు ఫలితాలిచ్చాయని క్లుగే అభిప్రాయడ్డారు. కానీ, రాజకీయ ప్రయోజనాల కోసం త్వరగా ఆంక్షలు ఎత్తివేయడం సరైంది కాదని హెచ్చరించారు. ప్రస్తుతం కేసుల్లో తగ్గుదల కనిపిస్తున్నా..పరిస్థితి మాత్రం సంక్లిష్టంగానే ఉందని ప్రభుత్వాలను అప్రమ్తతం చేశారు. 

కాగా, ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం.. యూరోపియన్‌ యూనియన్‌లో ఇప్పటివరకు 15.7 మిలియన్ల కొవిడ్-19  కేసులు నమోదు కాగా, మొత్తం మరణాల సంఖ్య 3,55,000గా ఉందని క్లుగే వెల్లడించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని