టెస్ట్‌లు పెంచుతాం.. కేసులు తగ్గిస్తాం‌!

తాజా వార్తలు

Updated : 21/07/2020 22:47 IST

టెస్ట్‌లు పెంచుతాం.. కేసులు తగ్గిస్తాం‌!

పాజిటివిటీ రేటు 5శాతానికి తగ్గించడమే లక్ష్యం 

ఆరోగ్యశాఖ అధికారుల వెల్లడి

దిల్లీ: ప్రపంచ దేశాలతో పోలిస్తే కరోనా మరణాలు భారత్‌లోనే తక్కువని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. మరణాల రేటు 2.43శాతానికి తగ్గిందని అధికారులు తెలిపారు. జాతీయ సగటు కంటే 30 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో కరోనా కేసులు తక్కువగా ఉన్నాయన్నారు.  ప్రతి మిలియన్‌ జనాభాకు భారత్‌లో మరణాల రేటు 20.4గా ఉండగా.. ప్రపంచ సగటు 77గా ఉందని అధికారులు తెలిపారు. అమెరికాలో అయితే మనకంటే 21రెట్లు, యూకేలో 33రెట్లు మరణాలు అధికమన్నారు. 

కేసులు తగ్గించేందుకు పరీక్షలు పెంచాలి

కరోనా పాజిటివిటీ రేటును తగ్గించేందుకు కరోనా పరీక్షలు విస్తృతంగా చేయాల్సిన అవసరం ఉందన్నారు.  కరోనా కేసులు తగ్గించడానికి పరీక్షలు పెంచాల్సిన అవసరం ఉంది. కరోనా కేసులు 5శాతం కంటే తక్కువకు చేరేందుకు పరీక్షలు పెంచాలన్నారు. 19 రాష్ట్రాల్లో 10లక్షల జనాభాకు రోజుకు 140కిపైగా పరీక్షలు జరుగుతున్నాయని తెలిపారు. దేశంలో పాజిటివిటీ రేటును 5శాతం కంటే తక్కువగా తీసుకురావడమే లక్ష్యంగా పరీక్షల నిర్వహణలో ఇదే దూకుడుతో ముందుకెళ్తామని ఆరోగ్య మంత్రిత్వశాఖ ఓఎస్డీ రాజేష్‌ భూషణ్‌ తెలిపారు. ఈ రోజు వరకు దేశంలో పాజిటివిటీ రేటు 11.14శాతంగా ఉందన్న అధికారులు.. వారం క్రితం 10శాతంగా.. నాలుగు వారాల క్రితం 8 శాతంగా ఉండేదని వివరించారు.  

నిన్నటి నుంచి ఈ రోజు ఉదయం 8గంటల వరకు దేశంలో 37,148 కొవిడ్‌ కేసులు నమోదైన విషయం తెలిసిందే. దీంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 11,55,191కి చేరింది. మొత్తం బాధితుల్లో 7,24,578మంది కోలుకోగా.. 28,084మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో ప్రస్తుతం 4,02,529 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.  


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని