లద్దాఖ్‌లో జెండాలతో చైనా సైన్యం నిరసన 

తాజా వార్తలు

Published : 12/07/2021 22:34 IST

లద్దాఖ్‌లో జెండాలతో చైనా సైన్యం నిరసన 

శ్రీనగర్‌: లద్దాఖ్‌లోని దెమ్‌చుక్‌ ప్రాంతంలోకి వచ్చి బ్యానర్లు, జెండాలతో చైనా సైన్యం నిరసన తెలిపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 6న అక్కడి భారతీయులు దలైలామా పుట్టిన రోజు వేడుకలు నిర్వహించడంపై వారు నిరసన తెలిపినట్టు సమాచారం. దలైలామా జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్న ప్రదేశానికి చైనా సైనికాధికారులు సహా కొందరు పౌరులు అయిదు వాహనాల్లో వచ్చారు. సింధు నదికి అవతలి ఒడ్డున నిలిచి చైనాకు సంబంధించిన బ్యానర్లు, జెండాలు చూపుతూ తమ నిరసన వ్యక్తం చేశారు.

దలైలామా 86వ పుట్టినరోజు సందర్భంగా గతవారం ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు ఫోన్‌ చేసి శుభాకాంక్షలు తెలిపారు.  ఈ విషయాన్ని ఆయన ట్విటర్ ద్వారా వెల్లడించారు. ప్రధానిగా మోదీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఆయన దలైలామాతో ఫోన్‌లో మాట్లాడినట్టు ధ్రువీకరించడం ఇదే ప్రథమం. భారత్‌-టిబెట్ విధానంలో గణనీయమైన మార్పును ప్రధాని ట్వీట్‌ చూపిస్తోందని అంతర్జాతీయ వర్గాల్లో చర్చ ప్రారంభమైంది. మరోవైపు చైనా కమ్యూనిస్టు పార్టీ 100 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ దేశానికి భారత్‌ శుభాకాంక్షలు తెలపకపోవడం గమనార్హం. కొవిడ్‌ ఉద్ధృతి అదుపులోకి వచ్చిన అనంతరం దలైలామా ప్రధాని మోదీతో భేటీ అయ్యే అవకాశం ఉన్నట్టు టిబెట్‌ రాజకీయ వర్గాలు పేర్కొన్నాయి.

భారత్‌-చైనా మధ్య గతేడాది నుంచి సైనిక ప్రతిష్టంభన కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దశలవారీగా సైనిక, దౌత్యపరమైన చర్చలు జరిగినప్పటికీ.. పాంగాంగ్‌ సరస్సుకు ఉత్తర, దక్షిణ ఒడ్డున పరిమిత సంఖ్యలో ఇరు పక్షాల సైనిక బలగాలను వెనక్కి తీసుకోవడం మినహా ఆశించిన పరిణామాలు చోటుచేసుకోలేదు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని