Covaxin: మూడోదశ ట్రయల్స్‌లో 77.8 శాతం సామర్థ్యం!
close

తాజా వార్తలు

Updated : 22/06/2021 17:46 IST

Covaxin: మూడోదశ ట్రయల్స్‌లో 77.8 శాతం సామర్థ్యం!

దిల్లీ: కరోనా నియంత్రణ కోసం ప్రముఖ ఫార్మా సంస్థ భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన ‘కొవాగ్జిన్‌’ టీకా మూడో దశ క్లినికల్‌ ప్రయోగాల ఫలితాలు వచ్చేశాయి. కరోనా వైరస్‌పై ఈ టీకా 77.8 శాతం సమర్థంగా పనిచేస్తున్నట్లు ప్రయోగాల్లో తేలిందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. 

కొవాగ్జిన్‌ మూడో దశ క్లినికల్‌ ప్రయోగాల సమాచారాన్ని భారత్‌ బయోటెక్‌ గతవారం భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ)కు సమర్పించగా నిపుణుల కమిటీ నేడు ఆ వివరాలను సమీక్షించింది. ఈ టీకా మూడోదశ ప్రయోగాల్లో వైరస్‌పై 77.8శాతం ప్రభావం కనబరచినట్లు తెలిసింది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ ఫలితాల ఆధారంగా కొవాగ్జిన్‌ టీకా పూర్తి సామర్థ్యం స్పష్టంగా వెల్లడికానుంది.

కొవాగ్జిన్‌ను భారత్‌ బయోటెక్‌, ఐసీఎంఆర్‌ సంయుక్తంగా అభివృద్ది చేశాయి. ఫేజ్‌ 1, ఫేజ్‌ 2 క్లినికల్‌ పరీక్షల ఆధారంగా దేశంలో ఈ టీకా అత్యవసర వినియోగానికి ఈ ఏడాది జనవరిలో డీసీజీఐ అనుమతిలిచ్చింది. ఆ తర్వాత మూడో దశ క్లినికల్‌ ప్రయోగాలు నిర్వహించిన భారత్‌ బయోటెక్‌ ఇప్పటికే రెండు సార్లు ఫేజ్‌ 3 ట్రయల్‌ మధ్యంతర పరిశీలన ఫలితాలను ప్రకటించింది. తొలి మధ్యంతర ఫలితాల్లో 81శాతం, రెండో మధ్యంతర పరిశీలన ఫలితాల్లో 78శాతం ప్రభావశీలత కనబరచినట్లు కంపెనీ వెల్లడించింది. 



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని