సామాజిక దూరం పాటించకుంటే భారీ జరిమానా

తాజా వార్తలు

Published : 03/04/2020 13:55 IST

సామాజిక దూరం పాటించకుంటే భారీ జరిమానా

కెనడా(టొరంటో): కరోనా వైరస్‌ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ మహమ్మారి బారిన పడి వేల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ వైరస్‌ నివారణకు ప్రస్తుతం ఎలాంటి మందు లేదు. ప్రతి ఒక్కరూ స్వీయ నిర్బంధం, సామాజిక దూరం పాటించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. 

కెనడాలోని అతిపెద్ద వాణిజ్య నగరమైన టొరంటోలో కూడా ప్రజలు సామాజిక దూరం పాటించాలని అక్కడి అధికారులు సూచించారు. పార్కులు, బహిరంగ ప్రదేశాలు, ఏ ఇతర ప్రాంతాల్లోనైనా సరే ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకొనేటప్పుడు వారి మధ్య ఆరు అడుగుల దూరం ఉండాలని అధికారులు చెబుతున్నారు. కాగా, అక్కడి అధికారులు, వైద్యులు ఇచ్చే సలహాలను ప్రజలు పాటించడంలేదని వారు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో సామాజిక దూరం పాటించని వారికి 5000 కెనడా డాలర్లను జరిమానా విధించనున్నట్లు గురువారం కెనడా ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. సామాజిక దూరం పాటించకుంటే కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతుందని.. దీనివల్ల కెనడాలో అత్యవసర పరిస్థితులు ఏర్పడతాయని వారు వివరించారు. కరోనా కట్టడిలో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని