ఎన్‌కౌంట‌ర్‌లో హ‌త‌మైన ఉగ్ర‌వాదుల‌కు క‌రోనా!
close

తాజా వార్తలు

Updated : 05/07/2020 17:26 IST

ఎన్‌కౌంట‌ర్‌లో హ‌త‌మైన ఉగ్ర‌వాదుల‌కు క‌రోనా!

శ్రీన‌గ‌ర్‌: జ‌మ్మూక‌శ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో శ‌నివారం జ‌రిగిన ఎన్‌కౌంట‌ర్‌లో ఇద్ద‌రు ఉగ్ర‌వాదులు మ‌ర‌ణించిన విష‌యం తెలిసిందే. అయితే, వీరి మృత‌దేహాల‌కు కొవిడ్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా పాజిటివ్‌గా తేలిన‌ట్లు క‌శ్మీర్ పోలీసులు వెల్లడించారు. మెడికో-లీగ‌ల్ ప‌రీక్షల్లో భాగంగా చనిపోయిన ఉగ్ర‌వాదుల‌కు శ్రీన‌గ‌ర్‌లోని సీడీ ఆసుప‌త్రిలో పోస్టుమార్టంతోపాటు డీఎన్ఏ, కొవిడ్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. దీనిలో ఉగ్ర‌వాదులిద్ద‌రికీ వైర‌స్ సోకినట్లు తేలిందని పోలీసులు పేర్కొన్నారు. కొవిడ్-19 నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా వీరికి బారాముల్లాలో అంత్య‌క్రియ‌లు నిర్వ‌హిస్తామ‌ని తెలిపారు.

జ‌మ్మూకశ్మీర్‌ కుల్గాం జిల్లాలోని అర్రా ప్రాంతంలో కూంబింగ్ నిర్వ‌హిస్తోన్న భ‌ద్ర‌తా ద‌ళాల‌పై ఉగ్ర‌వాదులు కాల్పులు జ‌రిపారు. దీంతో అప్ర‌మ‌త్త‌మైన భార‌త సైన్యం ఎదురుకాల్పులు జ‌రిపింది. ఈ ఘ‌ట‌న‌లో ఇద్ద‌రు తీవ్రవాదులు మరణించిన విష‌యం తెలిసిందే. ఇదిలా ఉంటే, జ‌మ్మూ క‌శ్మీర్‌లో గ‌డిచిన ఆరు నెలల్లో దాదాపు 118ఉగ్ర‌వాదులు హ‌త‌మైన‌ట్లు క‌శ్మీర్ ఐజీపీ విజ‌య్ కుమార్ వెల్ల‌డించారు. వీరిలో 107మంది స్థానిక ఉగ్ర‌వాదులు కాగా మ‌రో  11మంది పాకిస్థానీలు ఉన్నార‌ని తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని