Demchok: భారత భూభాగంలో చైనా గుడారాలు..!

తాజా వార్తలు

Published : 26/07/2021 11:00 IST

Demchok: భారత భూభాగంలో చైనా గుడారాలు..!

ఇంటర్నెట్‌డెస్క్‌: ఓ పక్క కోర్‌ కమాండర్ల స్థాయి భేటీకి ఏర్పాట్లు జరుగుతున్నా చైనా కవ్వింపు చర్యలు మాత్రం ఆగటంలేదు. తాజాగా దెమ్‌చోక్‌లోని చార్‌డింగ్‌ నాలా వద్ద ఆ దేశం గుడారాలను వేసినట్లు సమాచారం. దీంతో భారత సైన్యం అక్కడి వారిని ప్రశ్నించగా.. తాము చైనా పౌరులమని చెప్పినట్లు తేలింది. దీంతో సైన్యం వారిని అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్లిపోవాలని హెచ్చరించినట్లు అధికారులు చెబుతున్నారు. కానీ, వారు అక్కడే కొనసాగుతున్నట్లు సమాచారం.

వాస్తవానికి నేడు ఇరు దేశాల మధ్య కోర్‌ కమాండర్‌ స్థాయి సమావేశం జరగాల్సి ఉంది. కార్గిల్‌ యుద్ధ విజయ దినోత్సవ కార్యక్రమాలు ఉండటంతో భారత్‌ దీనిని వాయిదా వేసింది. అదే సమయంలో ఈ గుడారాలు ప్రత్యక్షం కావడం గమనార్హం. 1990ల్లో ఏర్పాటు చేసిన ఇండో చైనా జాయింట్‌ వర్కింగ్‌ గ్రూప్‌.. దెమ్‌చోక్‌, ట్రిగ్‌హైట్స్‌లను వివాదాస్పద ప్రాంతాలుగా గుర్తించింది. వాస్తవాధీన రేఖ వెంట ఉద్రిక్తతలు పెరగడంతో ఇటీవలే భారత్‌ నార్తన్‌ కమాండ్‌లోని ఉగ్రవాద వ్యతిరేక దళాలను వాస్తవాధీన రేఖ వద్దకు తరలించింది. సరిహద్దులకు దళాల చేరవేతలు జరుగుతున్నా.. ఇరుపక్షాలు ముఖాముఖీ తలపడేంత ఉద్రిక్తత లేదని అధికారులు చెబుతున్నారు. దౌలత్‌ బేగ్‌ ఓల్డీ, చుషూల్‌ వద్ద ఏర్పాటు చేసిన హాట్‌లైన్ల ద్వారా చైనా దళాలతో వివిధ అంశాలపై సంప్రదింపులు, సమన్వయం జరుగుతోందన్నారు. ఇప్పటి వరకు 1500 సార్లు హాట్‌ మార్గంలో సందేశాలు ఇచ్చిపుచ్చుకొన్నట్లు అధికారులు చెబుతున్నారు. భారత్‌ పూర్తిగా 2019 నాటి పరిస్థితులు నెలకొల్పాలని కోరుతుండగా.. చైనా మాత్రం దళాలను శాంతి సమయాల్లో మోహరించే చోట్ల ఉంచితే చాలని అంటోంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని