Taliban: జర్నలిస్ట్‌ను.. ముక్కు నేలకు రాయించిన తాలిబన్లు..

తాజా వార్తలు

Published : 08/09/2021 01:19 IST

Taliban: జర్నలిస్ట్‌ను.. ముక్కు నేలకు రాయించిన తాలిబన్లు..

కాబుల్‌: అఫ్గాన్‌లో తాలిబన్ల పైశాచికత్వం హెచ్చుమీరుతోంది. తమ స్వేచ్ఛ కోసం పోరాడుతున్న మహిళలను ఎక్కడికక్కడ అణచివేస్తున్నారు. అవసరమైతే దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా పాకిస్థాన్‌ రాయబార కార్యాలయం వద్ద మహిళలు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. ఇస్లామాబాద్‌, ఐఎస్‌ఐకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఆగ్రహం చెందిన తాలిబన్లు.. ఆ మహిళలను చెదరగొట్టేందుకు గాల్లోకి కాల్పులు జరిపారు. ఆ వార్తలను కవర్‌ చేస్తోన్న జర్నలిస్టులు, వీడియో గ్రాఫర్‌లపైనా ఉక్కుపాదం మోపారు. పలువురిని అరెస్టు చేసి, వారిపై దాడులకు పాల్పడినట్లు స్థానిక మీడియా సంస్థలు వెల్లడించాయి.

ముక్కు నేలకు రాయించారు

మహిళల నిరసన వార్తను కవర్‌ చేస్తుండగా తనను అదుపులోకి తీసుకున్నారని, కొన్ని గంటల తర్వాత విడుదల చేశారని ఓ జర్నలిస్టు తెలిపారు. ఆ సమయంలో తనపట్ల అమానుషంగా ప్రవర్తించినట్లు పేర్కొన్నారు. ‘ఆ వార్తను కవర్‌ చేసినందుకు నా ముక్కు నేలకు రాయమని ఆదేశించారు. ప్రాణభయంతో నేను ఆ పని చేయక తప్పలేదు’ అని ఆ జర్నలిస్టు వాపోయారు. తన ఐడీ కార్డును లాక్కున్నారని, కెమెరాను ధ్వంసం చేశారని మరో జర్నలిస్టు వెల్లడించారు. తనను కాలితో తన్నినట్లు ఆరోపించారు.

మూడు గంటల తర్వాత విడుదల

తాలిబన్లు అరెస్టు చేసిన వ్యక్తుల్లో ప్రముఖ‘టోలో న్యూస్‌’ కెమెరామెన్‌ వాహిద్‌ అహ్మది ఉన్నట్లు ఆ ఛానెల్‌ తెలిపింది. ఆ ఛానెల్‌ అధిపతి లోట్‌ఫుల్లా నజాఫిజాదా విన్నపంతో అతడిని మూడు గంటల తర్వాత విడిచిపెట్టినట్లు పేర్కొంది. అతడి వద్ద ఉన్న కెమెరాను సైతం వెనక్కి ఇచ్చినట్లు తెలిపింది. కెమెరామెన్‌తో సహా మరో 12 మందిని కూడా విడిచిపెట్టినట్లు నజాఫిజాదా ట్విటర్‌ ద్వారా వెల్లడించారు.

మా జర్నలిస్టులను కూడా అరెస్టు చేశారు

ర్యాలీ వార్తలను కవర్‌ చేస్తున్న తమ జర్నలిస్టులను కూడా అరెస్టు చేశారని స్థానిక ప్రధాన అరియానా న్యూస్‌ సంస్థ ప్రకటించింది. జర్నలిస్టు హయత్‌ బైసీతోపాటు, అతడి సహచరుడు సమీ జహేష్‌, కెమెరామెన్‌ సమిమ్‌లను తాలిబన్లు అరెస్టు చేసినట్లు న్యూస్‌ సంస్థ తెలిపింది. రెండు గంటల తర్వాత వారిని వదిలేసినట్లు పేర్కొంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని