Vaccine: జులైలో 13.45కోట్ల మందికి టీకా పంపిణీ

తాజా వార్తలు

Published : 07/08/2021 18:05 IST

Vaccine: జులైలో 13.45కోట్ల మందికి టీకా పంపిణీ

దిల్లీ: దేశంలో టీకా పంపిణీ నెలనెలా శరవేగంగా పెరుగుతోందని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ అన్నారు. జులై నెలలో 13.45 కోట్ల డోసులను పంపిణీ చేసినట్లు తెలిపారు. అంటే సగటున రోజుకు 43.41లక్షల మందికి టీకాలు వేశామని కేంద్రమంత్రి ట్విటర్‌లో పేర్కొన్నారు. 

‘‘కొవిడ్‌పై పోరులో భారత్‌ రోజురోజుకీ మరింత బలంగా తయారవుతోంది. ప్రతి నెలా వ్యాక్సినేషన్‌ వేగంగా పెరుగుతోంది. జులైలో సగటున రోజుకు 43.41లక్షల మందికి డోసులకు అందించగా.. మొత్తంగా ఆ నెలలో 13.45 కోట్ల డోసులు అందించాం’’ అని మాండవీయ తెలిపారు. ఇప్పటికే కొవిడ్‌ వ్యాక్సినేషన్‌లో దేశం అరుదైన మైలురాయిని అధిగమించింది. టీకా పంపిణీలో 50 కోట్ల మార్క్‌ను దాటింది. శనివారం ఉదయం నాటికి 50,10,09,609 మంది టీకాలు తీసుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. 

మరోవైపు వ్యాక్సినేషన్‌ను మరింత వేగవంతం చేసే దిశగాద మరో టీకాకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. అమెరికాకు చెందిన జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ టీకాకు కేంద్రం నేడు అత్యవసర వినియోగ అనుమతులు మంజూరు చేసింది. దీంతో దేశంలో మొత్తం ఐదు టీకాలు అందుబాటులోకి వచ్చినట్లయింది. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని