close

తాజా వార్తలు

క్యాబ్‌పై ఆందోళనలు.. ముగ్గురి మృతి

గువాహటి: పౌరసత్వ సవరణ బిల్లుపై అసోంలో చెలరేగిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. గువాహటిలో ఆందోళనకారులపై గురువారం సాయంత్రం పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందారు. పలువురు గాయపడ్డారు. గువాహటిలో విధించిన కర్ఫ్యూను ధిక్కరిస్తూ ప్రజలు ఆందోళనలకు దిగిన క్రమంలో వారిని అదుపుచేసేందుకు పోలీసులు కాల్పులకు దిగారు.

పార్లమెంట్‌ ఆమోదం పొందిన ఈ బిల్లుపై అసోం సహా, త్రిపురలోనూ ఆందోళనలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కేంద్ర పారామిలటరీ దళాలు మోహరించాయి. పది జిల్లాల్లో విధించిన ఇంటర్నెట్‌ సేవల బంద్‌ను మరో 48 గంటల పాటు పొడిగించారు. గువాహటిలో నిరవధిక కర్ఫ్యూ కొనసాగుతోంది. అసోంలోని ఇతర పట్టణాల్లోనూ కర్ఫ్యూను విధించారు.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.