కొవిడ్‌ ఔషధాలు, ఆక్సిజన్‌పై పన్ను మినహాయించండి!
close

తాజా వార్తలు

Updated : 09/05/2021 15:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కొవిడ్‌ ఔషధాలు, ఆక్సిజన్‌పై పన్ను మినహాయించండి!

ప్రధానికి లేఖ రాసిన బెంగాల్‌ ముఖ్యమంత్రి

కోల్‌కతా: దేశంలో కరోనా సంక్షోభానికి కారణమంటూ కేంద్ర ప్రభుత్వం తీరుపై విరుచుకుపడుతున్న పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తాజాగా ప్రధానమంత్రికి మరో లేఖ రాశారు. దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న వేళ దిగుమతి చేసుకుంటున్న ఔషధాలు, వివిధ వైద్య పరికరాలపై పన్నులను రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇదే సమయంలో పశ్చిమ బెంగాల్‌తోపాటు దేశవ్యాప్తంగా ఆరోగ్య మౌలికసదుపాయాలను బలోపేతం చేయడంతోపాటు, కొవిడ్‌ ఔషధాలు, ఆక్సిజన్‌ సరఫరాను పెంచాలని మమతా బెనర్జీ కోరారు.

‘దేశంలో కరోనా తీవ్రత నేపథ్యంలో సంస్థలు, ఏజెన్సీలు, వ్యక్తిగతంగా ఎంతో మంది ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు, సిలిండర్లు, క్రయోజనిక్‌ స్టోరేజ్‌ ట్యాంకులకు విరాళంగా అందిస్తున్నాయి. ప్రైవేటు సహాయాన్ని ప్రోత్సహించడంలో భాగంగా అలాంటి వస్తువులపై జీఎస్‌టీతోపాటు కస్టమ్స్‌ సుంకాన్ని వినహాయించాలి’ అని బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. ఈ విషయంపై ఎంతో మంది దాతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదిస్తున్నారని.. అందుచేత జీఎస్‌టీ/కస్టమ్స్‌ సుంకంతో పాటు ఇతర పన్నుల నుంచి మినహాయింపు ఇవ్వాలని ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు.

ముఖ్యమంత్రిగా మూడోసారి బాధ్యతలు చేపట్టిన అనంతరం మమతా బెనర్జీ ప్రధానమంత్రికి లేఖ రాయడం ఇది మూడోసారి. రాష్ట్రంలో కొవిడ్‌ సంక్షోభం, ఆక్సిజన్‌ సరఫరా అంశాలపై ఇంతకుముందు రాసిన లేఖలో దీదీ ప్రస్తావించారు. ఇక ఈమధ్యే ఎన్నికలు పూర్తి చేసుకున్న పశ్చిమ బెంగాల్‌లో కొన్ని రోజులుగా కొవిడ్‌ ఉద్ధృతి పెరుగుతోంది. తాజాగా నిన్న ఒక్కరోజే 19 వేల పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వైరస్‌ తీవ్రత పెరిగిన నేపథ్యంలో ఇప్పటికే అక్కడ పాక్షిక లాక్‌డౌన్‌ ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఇదిలాఉంటే, దేశంలో కరోనా వైరస్‌ ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా 4లక్షల 3వేల కేసులు, 4092 కొవిడ్ మరణాలు నమోదయ్యాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని