Xi Jinping : దేశానికి మంచి ఇమేజ్‌ను పెంచండి!

తాజా వార్తలు

Published : 02/06/2021 14:36 IST

Xi Jinping : దేశానికి మంచి ఇమేజ్‌ను పెంచండి!

ఇంటర్నెట్‌డెస్క్‌: నియంతృత్వ దేశంగా పేరున్న చైనా తన ఇమేజ్‌ను మార్చుకొనే ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇటీవల చైనా కమ్యూనిస్టు పార్టీ పొలిట్‌ బ్యూరో నేతలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ మాట్లాడుతూ ‘నమ్మకమైన, గౌరవప్రదమైన, ప్రేమపూర్వక దేశంగా చైనా ఇమేజ్‌ను పెంచండి’ అని అధికారులకు సూచించారు. ఈ విషయాన్ని చైనా అధికారిక న్యూస్‌ ఏజెన్సీ షినోవా పేర్కొంది. దీంతో  ఆ దేశ రాయబారులు తమ దుందుడుకు వ్యవహార శైలిని, వైఖరిని మార్చుకోమని పరోక్షంగా సూచించారు.  

పొలిట్‌ బ్యూరో భేటీలో అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ మాట్లాడుతూ ‘మిత్రులను విస్తృతంగా పెంచుకోండి. అత్యధిక మందిని ఏకతాటి మీదకు తీసుకురండి. చైనాను అర్థం చేసుకొని.. స్నేహపూర్వకంగా ఉండేవారి సంఖ్యను గణనీయంగా పెంచుకోండి. ప్రపంచంతో సంబంధాలు నెరిపే సమయంలో మన మాటలపై పట్టు ఉండాలి. అదే సమయంలో ఆత్మవిశ్వాసంతో స్వేచ్ఛగా మాట్లాడగలగాలి.  ఆ మాటలు పరిమితంగా, సున్నితంగా ఉండాలి’ అని హితవు పలికారు. 

ఇటీవలి కాలంలో చైనా దౌత్యవేత్త దూకుడు వ్యవహార శైలి కారణంగా ఆ దేశానికి ప్రపంచవ్యాప్తంగా ఎదురుదెబ్బలు తగిలాయి. చైనా దౌత్యాన్ని ‘వూల్ఫ్‌ వారియర్‌’ డిప్లొమసీగా నిందించడం మొదలుపెట్టారు. అంతేకాదు, ట్రావెల్‌ బ్యాన్‌లు, ఆంక్షలు, దౌత్య నిరసనలు వంటి వాటిని చైనా తరచూ ఎదుర్కొంటోంది. ఇటీవలి కాలంలో ఐరోపా సమాఖ్య, ఫిలిప్పీన్స్‌ వంటి వాటితో ఉన్న సంబంధాలు దెబ్బతినడానికి ఇలాంటి వైఖరే కారణమైందనే అపవాదు ఉంది.  

దీనిపై రెన్‌మిన్‌ విశ్వవిద్యాలయంలో ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ అఫైర్స్‌ డైరెక్టర్ వాంగ్‌ యివీ మాట్లాడుతూ ‘‘కరోనా వైరస్‌ కారణంగా పశ్చిమ దేశాల్లో చైనా ప్రతిష్ఠ బాగా దెబ్బతింది. చైనా శక్తిని ప్రపంచం ఆమోదించాలి. అప్పుడే చైనా నిజమైన శక్తిమంతమైన దేశం అవుతుంది’’ అని అన్నారు. 

 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని