close

ప్రధానాంశాలు

Published : 21/04/2021 04:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

దిల్లీలో ఆక్సిజన్‌కు కటకట

ఈనాడు, దిల్లీ: దేశ రాజధాని దిల్లీని కరోనా దావానలంలా చుట్టుముట్టింది. ఆక్సిజన్‌ కొరతతో ఉక్కిరి బిక్కిరి అవుతోంది. సోమవారం రాత్రి విడుదల చేసిన డేటా ప్రకారం దిల్లీలో 33% పాజిటివిటీ రేటు తేలింది. అంటే ప్రతి ముగ్గురిలో ఒకరికి కరోనా ఉన్నట్లు వెల్లడైంది.  ఇదివరకు ఎన్నడూ లేనంతగా ఒకేరోజు 277 మంది చనిపోయారు. మరోవైపు ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ 8-12 గంటలకు మించి సరిపోదని ఉపముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా చేసిన ప్రకటన ప్రమాద ఘంటికలను మోగించింది. కొన్ని ఆసుపత్రుల్లో కేవలం కొన్ని గంటలకు సరిపడా ఆక్సిజన్‌ నిల్వలు మాత్రమే ఉన్నాయని, అందువల్ల తక్షణం మెడికల్‌ ఆక్సిజన్‌ను పంపాలని కేంద్రానికి దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ విజ్ఞప్తిచేశారు. ఈ విషయంలో వెంటనే జోక్యం చేసుకోవాలంటూ కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్‌ గోయల్‌కు ఆయన లేఖ రాశారు.
ఆర్థిక ప్రయోజనాలే ముఖ్యమా?: హైకోర్టు
దేశ రాజధానిలో ఆక్సిజన్‌ కొరతపై దిల్లీ హైకోర్టు మంగళవారం తీవ్ర అసహనం వ్యక్తంచేసింది. మనుషుల ప్రాణాల కన్నా ఆర్థిక ప్రయోజనాలు ముఖ్యం కాదని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఈ నెల 22వ తేదీ వరకు వేచి చూడకుండా ఆక్సిజన్‌ పారిశ్రామిక వినియోగంపై తక్షణం నిషేధం విధించాలని కేంద్రాన్ని ఆదేశించింది. దిల్లీలోని చాలా ఆసుపత్రుల్లో 4 నుంచి 8 గంటలకు సరిపడా ఆక్సిజన్‌ నిల్వలు మాత్రమే ఉన్నాయని, ఈ పరిస్థితుల్లో ఈ నెల 22 వరకు వేచిచూడడం ఏ మాత్రం న్యాయసమ్మతం కాదని జస్టిస్‌ విపిన్‌ సంఘీ, జస్టిస్‌ రేఖా పల్లిల నేతృత్వంలోని బెంచ్‌ వ్యాఖ్యానించింది. కేంద్రం తక్షణ నిషేధం విధించి, అవసరమైన ఆసుపత్రులకు ఆక్సిజన్‌ను తరలించాలని, విలువైన ప్రాణాలు కాపాడాలని స్పష్టీకరించింది. అలాగే ఒక్క డోసు టీకాల వృథా జరిగినా నేరపూరిత వఆక్సిజన్‌ సరఫరాపై కోర్టు ఉత్తర్వుల్ని పట్టించుకోని ఆక్సిజన్‌ తయారీదారు ‘ఐనాక్స్‌’పై ఎందుకు చర్యలు తీసుకోకూడదో తెలియజేయాలంటూ కోర్టు నోటీసులు జారీచేసింది. కంపెనీ ఎండీ ఈ నెల 22వ తేదీన కోర్టు ముందు హాజరుకావాలని ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వం తరఫున కోర్టుకు హాజరైన న్యాయవాది మోనికా అరోరా కోర్టుకు అఫిడవిట్‌ సమర్పిస్తూ- దిల్లీకి ఆక్సిజన్‌ సరఫరాలో ఏ మాత్రం అలసత్వం లేదని స్పష్టీకరించారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన