5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై అధికారులతో ఈసీ భేటీ

ప్రధానాంశాలు

Updated : 29/07/2021 07:42 IST

5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై అధికారులతో ఈసీ భేటీ

దిల్లీ: మరికొన్ని నెలల్లో శాసనసభ ఎన్నికలు నిర్వహించాల్సిన అయిదు రాష్ట్రాల్లో చేపట్టాల్సిన సన్నాహాలకు సంబంధించి ఎన్నికల సంఘం (ఈసీ) బుధవారం కీలక భేటీ నిర్వహించింది. గోవా, మణిపుర్‌, పంజాబ్‌, ఉత్తరాఖండ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. యూపీ శాసనసభ గడువు వచ్చే ఏడాది మే నెలలో, మిగిలిన నాలుగు రాష్ట్రాల అసెంబ్లీల గడువు మార్చిలో ముగియనుంది. వచ్చే ఏడాది ప్రారంభంలో అయిదు రాష్ట్రాల్లోనూ ఒకేసారి ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. పోలింగ్‌ స్టేషన్లలో కల్పించాల్సిన వసతులు, ఓటర్ల నమోదు, ఓటర్ల జాబితాలను సిద్ధం చేయడం, సీనియర్‌ సిటిజన్లకు, దివ్యాంగులకు పోస్టల్‌ బ్యాలెట్లు తదితర ఏర్పాట్లపై సీఈసీ సుశీల్‌ చంద్ర, ఎన్నికల కమిషనర్‌ అనూప్‌ చంద్ర పాండే తగు సూచనలు చేశారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన