మళ్లీ భగ్గుమన్న పెట్రోలు ధరలు

ప్రధానాంశాలు

Published : 17/10/2021 05:18 IST

మళ్లీ భగ్గుమన్న పెట్రోలు ధరలు

దిల్లీ: దేశంలో ఇంధన ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. పెట్రోలు, డీజిల్‌ ధరలు లీటరుకు 35 పైసల చొప్పున ఎగబాకాయి. తాజా పెరుగుదలతో అన్ని రాష్ట్ర రాజధానుల్లోనూ లీటరు పెట్రోలు ధర రూ.100 మార్కును దాటేసింది. ముంబయిలో లీటరు పెట్రోలుకు శనివారం రూ.111.43, దిల్లీలో 105.49 చొప్పున వసూలు చేశారు. ఈ ధరల పెంపును కాంగ్రెస్‌ యువజన విభాగం తీవ్రంగా ఖండించింది. దిల్లీలోని అక్బర్‌రోడ్‌లో ఉన్న కేంద్ర పెట్రోలియంశాఖ మంత్రి హర్దీప్‌సింగ్‌ పురి నివాసం వద్ద శనివారం నిరసన వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనకారులు నినాదాలు చేయడంతో, పోలీసులు వారిని అడ్డుకున్నారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన