TS News: పగలంతా ప్రజారవాణా
close

ప్రధానాంశాలు

Updated : 10/06/2021 08:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

TS News: పగలంతా ప్రజారవాణా

అందుబాటులోకి సిటీ బస్సులు, మెట్రో రైళ్లు

ఈనాడు, హైదరాబాద్‌: ఇకపై ఆటోవాలాలకు అధిక ఛార్జీలు చెల్లించక్కర్లేదు. పేదలు పాదాలకు పనిచెప్పనక్కర్లేదు. ఉద్యోగులు సొంత వాహనాలను తీయాల్సిన అవసరంలేదు. ప్రభుత్వం లాక్‌డౌన్‌ నిబంధనలను సడలించడంతో గురువారం నుంచి పగలంతా ఆర్టీసీ సిటీ బస్సులు తిరుగుతాయ్‌.. మెట్రో రైళ్లు పరిగెడతాయ్‌. ఆటోలు, క్యాబ్‌లు నడుస్తాయి. ఎంఎంటీఎస్‌లు మాత్రం తిరగవు. కార్యాలయాలు పూర్తి స్థాయిలో పని చేయనుండడంతో ఆర్టీసీ సిటీ బస్సులన్నింటినీ అందుబాటులోకి తెస్తామని గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌ ఈడీ వెంకటేశ్వర్లు ప్రకటించారు.

బస్సులు ఉదయం 6 నుంచే

ఈనెల 10వ తేదీ నుంచి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ లాక్‌డౌన్‌ను సడలించడంతో వివిధ కార్యాలయాలకు పనులు మీద వెళ్లేవారి సంఖ్య పెరుగుతుంది. పగలంతా ప్రయాణికులకు సిటీ బస్సులు అందుబాటులో ఉండేలా ఆర్టీసీ చర్యలు చేపట్టింది. రెండు షిఫ్టుల్లో మొత్తం 2750 బస్సులు అందుబాటులోకి తెస్తామని ఈడీ వెంకటేశ్వర్లు చెప్పారు. గతంలో మాదిరే అన్ని కాలనీలకు సర్వీసులు తిరుగుతాయని ప్రకటించారు. నగరం నుంచి తెలంగాణలోని జిల్లాలకు, ముఖ్యమైన ప్రాంతాలకు రాకపోకలు సాగించే బస్సులు ఉదయం 6 గంటల నుంచి మొదలై.. చివరి ట్రిప్పు సాయంత్రం 6 గంటలకు గమ్యస్థానం చేరేలా ఏర్పాట్లు చేశామని రంగారెడ్డి, హైదరాబాద్‌ ఆర్టీసీ జోన్‌ ఈడీ మునిశేఖర్‌ తెలిపారు.

బస్‌పాస్‌లు జారీ చేస్తాం

ఆర్టీసీ సిటీ బస్‌ పాస్‌లు జారీ చేసే కేంద్రాలు ఉదయం 6.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ పని చేస్తాయి. 2021-22 విద్యా సంవత్సరానికి విద్యార్థులకు బస్సు పాస్‌లను ఆర్టీసీ జారీ చేస్తోంది. 6వ తరగతి, ఆపై తరగతులు చదువుతున్న విద్యార్థులందరూ..

ద్వారా ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆయా విద్యాసంస్థలు ఆర్టీసీకి పరిపాలనాపరమైన రుసుములు చెల్లించాల్సి ఉంది. ఈనెల 10వ తేదీ నుంచి ఆన్‌లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని.. ఇదే నెల 15వ తేదీ నుంచి బస్సు పాస్‌లు జారీ చేస్తామని తెలిపింది. 5వ తరగతి వరకూ చదువుతున్న విద్యార్థులు ఆన్‌లైన్లో నుంచి దరఖాస్తు డౌన్‌లోడ్‌ చేసుకోవడం లేదా.. బస్సు పాస్‌ కేంద్రాల   నుంచి దరఖాస్తులను తీసుకుని ఆయా విద్యా సంస్థకు చెందిన ప్రధానోపాధ్యాయుడి సంతకంతో నేరుగా అందజేస్తే ఉచిత బస్‌ పాస్‌ ఇస్తారు.

ఉ.7 నుంచి సా.6 గంటల వరకు మెట్రో రైళ్లు

గురువారం నుంచి మెట్రో రైలు వేళల్నీ పొడిగించారు. ఉదయం  ఏడు నుంచి సాయంత్రం 6 గంటల వరకు మెట్రో సర్వీసులు తిరుగుతాయి. మొదటి సర్వీసు టర్మినల్‌ స్టేషన్లు ఎల్‌బీనగర్, మియాపూర్, నాగోల్, రాయదుర్గం, జేబీఎస్‌ నుంచి ఉదయం 7 గంటలకు బయలుదేరుతుంది. ఇక్కడి నుంచి చివరి సర్వీసు సాయంత్రం 5 గంటలకు ప్రారంభమై ఆరు గంటలకల్లా గమ్యస్థానాలకు చేరుతాయి. కొవిడ్‌ నిబంధనలను తు.చ. తప్పకుండా పాటించాలని ఎల్‌అండ్‌టీ హైదరాబాద్‌ మెట్రో రైలు ఎండీ కేవీబీ రెడ్డి ప్రయాణికులకు సూచించారు.

పగలు సడలింపు.. రాత్రి పట్టు బిగింపు

లాక్‌డౌన్‌ ఆంక్షలను రోజులో 12 గంటలకు పరిమితం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. సాయంత్రం ఆరు నుంచి మరుసటి రోజు ఉదయం ఆరు గంటల వరకూ నిబంధనలను కఠినంగా అమలు చేయనున్నారు. జనసమ్మర్థ ప్రాంతాలు, వాహనదారులపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. షాపింగ్‌మాళ్లు, హోటళ్లు తదితర దుకాణాలపై విపత్తు నివారణ చట్టం ప్రకారం చర్యలు చేపట్టనున్నారు. సాయంత్రం ఆరు దాటగానే వాహనదారులపై కేసులు నమోదు చేస్తారు. మరోవైపు నగరం, శివారు ప్రాంతాల్లోని పెట్రోల్‌ పంపులు సాయంత్రం 5 గంటల వరకే పనిచేయనున్నాయని పోలీసులు తెలిపారు. జాతీయ రహదారులపై ఉన్న వాటిని మినహాయింపు ఉందని పేర్కొన్నారు. 
సరిహద్దుల్లో తనిఖీలు.. లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘించే వారిపై చర్యలు చేపట్టేందుకు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసులు వాహనాలను తనిఖీ చేయనున్నారు. మూడు కమిషనరేట్లలో 280 చెక్‌ పోస్టులున్నాయి. అదనంగా ప్రతి ఠాణా పరిధిలో అంతర్గత చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. అత్యవసర సేవల వాహనాలు, అంబులెన్స్‌లు, రోగుల కార్లు, ఆసుపత్రులకు వెళ్తున్న వారిని చెక్‌పోస్టుల వద్ద ఆపకుండా ఉండేందుకు వీలుగా రాత్రి పది గంటలు దాటాక 40 శాతం తనిఖీ కేంద్రాలను ఎత్తేస్తున్నారు. గల్లీలు, అనుసంధాన రహదారుల్లో సంచారం పెరగడంతో గస్తీ బృందాలు తనిఖీ చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. 
Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 125
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 126
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 127
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461815444-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
      [script_params] => [300, 600]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

  [7] => stdClass Object
    (
      [script_id] => 149
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461996658-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 9
    )

  [8] => stdClass Object
    (
      [script_id] => 150
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615547875330-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
      [script_params] => [320, 50]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 10
    )

)
మరిన్ని

దేవతార్చన