China: ఒక్కరోజులో రూ.14 వేల కోట్ల వస్తువుల అమ్మకం!

ప్రధానాంశాలు

Published : 24/10/2021 14:22 IST

China: ఒక్కరోజులో రూ.14 వేల కోట్ల వస్తువుల అమ్మకం!

చైనా సేల్స్‌మ్యాన్‌ లీ జియాకి రికార్డు

బీజింగ్‌: చైనాకు చెందిన ఓ సేల్స్‌పర్సన్‌ ఒక్కరోజులోనే రూ.14వేల కోట్ల వస్తువులు విక్రయించి రికార్డు సృష్టించాడు. అలీ బాబా గ్రూపునకు చెందిన ‘టవోబవో’ అనే చైనీస్‌ యాప్‌లో లీ జియాకి.. వస్తువుల గురించి తెలియజేస్తూ విక్రయిస్తుంటాడు. మహిళలు వాడే లిప్‌స్టిక్స్‌ను అమ్మడంలో లీ దిట్ట. అందుకే అతడు ‘కింగ్‌ ఆఫ్‌ లిప్‌స్టిక్స్‌’, ‘లిప్‌స్టిక్‌ బ్రదర్‌’గా పేరు సంపాదించాడు. తాజాగా లీ ఒక్క రోజులోనే వేల కోట్ల రూపాయల విలువ చేసే వస్తువుల్ని విక్రయించాడు. అలీబాబా సంస్థ ఏటా యాన్యువల్‌ షాపింగ్‌ ఫెస్టివల్‌ను నిర్వహించి భారీ ఆఫర్లను ప్రకటిస్తుంటుంది.

ఈ నేపథ్యంలో లీ జియాకి ప్రత్యక్షప్రసారం ద్వారా ఒక్క రోజులోనే లోషన్స్‌ నుంచి యాపిల్‌ ఎయిర్‌పాడ్స్‌ వరకు రూ.14.23 వేల కోట్లు విలువ చేసే వస్తువుల్ని విక్రయించాడు. దీంతో చైనాలో అతడి పేరు మరోసారి మార్మోగిపోయింది. గతంలోనూ ఐదు నిమిషాల్లో 15వేల లిప్‌స్టిక్స్‌ను అమ్మి అందరినీ ఔరా అనిపించాడు. 2019లో మోడల్స్‌కు 30 సెకన్లలో అత్యధిక లిప్‌స్టిక్స్‌ రాసిన వ్యక్తిగా గిన్నిస్‌ రికార్డులో చోటు సంపాదించాడు. 



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన