close

తాజా వార్తలు

వికారానికి కరివేపాకు 

ఇంటి వైద్యం

గర్భిణులకే కాదు, సామాన్యులకు కూడా అప్పుడప్పుడూ వికారంగా అనిపించడం, వాంతులు రావడం సర్వసాధారణం. వాటిని అదుపులో ఉంచేందుకు మాత్రలే వేసుకోనక్కర్లేదు. ఆయుర్వేదపరంగా కొన్ని చిట్కాలు పాటిస్తే... ఆ సమస్యలు తగ్గుతాయి. 
సాధారణంగా జీర్ణాశయం సక్రమంగా పనిచేస్తే గనుక వికారం, వాంతులు వంటివి రావు. కానీ జీర్ణాశయం సరిగ్గా పనిచేయకపోయినా, కొన్ని రకాల అనారోగ్యాలు ఉన్నా... ఈ రెండు లక్షణాలు కనిపిస్తుంటాయి. తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోయినా, ఆకలి ఎక్కువగా వేసినప్పుడు, జీర్ణాశయంలో ఇన్‌ఫెక్షన్లు ఉన్నప్పుడు వికారం, వాంతులు కలగొచ్చు. అలాగే జ్వరం ఉన్నప్పుడు, నెలసరి వచ్చేముందు, తలనొప్పి ఎక్కువగా ఉన్నా కూడా ఈ సమస్యలు ఎదురవుతాయి. గర్భిణీలకు అయితే వేవిళ్ల సమయంలో కలిగే వికారం గురించి తెలిసిందే. ఈ రెండింటినీ అదుపులో ఉంచేందుకు ఏం చేయాలంటే... 
* వికారంగా అనిపించినప్పుడు చెంచా జీలకర్రని నోట్లో వేసుకుని నమలాలి. వెంటనే ఉపశమనం లభిస్తుంది. 

వికారానికి కరివేపాకు 

* కప్పు దానిమ్మ రసంలో సమానంగా తేనె కలిపి రోజుకి రెండు లేదా మూడుసార్లు తీసుకుంటూ ఉంటే... వికారం, వాంతులు తగ్గుతాయి. 

వికారానికి కరివేపాకు 

* చెంచా కరివేపాకు ముద్దను గ్లాసుడు పల్చని మజ్జిగలో కలపాలి. ఇందులో పావుచెంచా సైంధవ లవణం కూడా వేయాలి. దీన్ని ఆరారగా తీసుకుంటే వాంతుల సమస్య తగ్గుముఖం పడుతుంది. 
* రెండు చెంచాల కరివేపాకు రసానికి చెంచా నిమ్మరసం, పావు చెంచా చక్కెర కలిపి తీసుకున్నా చాలు. 

వికారానికి కరివేపాకు 

వికారానికి కరివేపాకు * రెండు చెంచాల తులసి ఆకుల రసంలో రెండు యాలకుల పొడి కలిపి తీసుకుంటే వాంతులు, వికారం తగ్గుతాయి. 

* పావు చెంచా లవంగ చూర్ణంలో సమపాళ్లలో తేనె కలిపి తీసుకున్నా పరిష్కారం లభిస్తుంది. 
ఈ సూచనలను అన్ని వయసులవారే కాదు, గర్భిణులు కూడా పాటించొచ్చు. ఒకవేళ వాంతులు ఎక్కువగా అవుతున్నా... వాటితోపాటు జ్వరం ఉన్నా, తలనొప్పి కూడా వేధిస్తోంటే వైద్యులను సంప్రదించాలి. 
మీ ప్రశ్నలు ఇకపై ‌vasuayur@eenadu.net కు పంపించగలరు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.