close

తాజా వార్తలు

ఏదో ఒకనాడు కోహ్లీకి సరిజోడు!

అదే ఆకలి.. అదే తపన బాబర్‌ అజామ్‌లో ఉన్నాయి: పాక్‌ బ్యాటింగ్‌ కోచ్‌

బర్మింగ్‌హామ్‌: న్యూజిలాండ్‌పై అద్భుతమైన బ్యాటింగ్‌తో విజయం అందించిన బాబర్‌ అజామ్‌ను పాక్‌ బ్యాటింగ్‌ కోచ్‌ గ్రాంట్‌ ఫ్లవర్‌ ప్రశంసించాడు. టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీలోని తపన, కసి అతడిలోనూ ఉన్నాయని వెల్లడించాడు. ఏదో ఒక రోజు ఆ స్థాయిని కచ్చితంగా చేరుకుంటాడని ధీమా వ్యక్తం చేశాడు. కోహ్లీని అజామ్‌ ఆదర్శంగా భావిస్తాడు.

‘బాబర్‌ అజామ్‌ చాలా ప్రత్యేకం. పాక్‌లో అత్యుత్తమ క్రికెటర్‌గా ఎదుగుతాడు. అతను ఆకలితో ఉన్నాడు. యువకుడు. ఫిట్‌నెస్‌ ఉంది. ఇప్పటిలాగే నేలపై ఉంటే కచ్చితంగా అతనికి గొప్ప కెరీర్‌ ఉంటుంది. ఒదిగి ఉంటాడని నమ్మకం ఉంది. విరాట్‌లోని ఆకలి అతడికి ఉంది. ఏదో ఒకనాడు అతడు కచ్చితంగా కోహ్లీ స్థాయిలో ఉంటాడు’ అని గ్రాంట్‌ ఫ్లవర్‌ అన్నాడు. కివీస్‌పై 238 పరుగుల లక్ష్య ఛేదనలో పాక్‌ 110కే 3 వికెట్లు కోల్పోయింది. అలాంటి దశలో బాబర్‌ 101 పరుగులతో అజేయంగా నిలిచాడు.

‘అతడిలో ఆకలి ఉంది. సాధ్యమైనంత కఠినంగా సాధన చేస్తే, నైపుణ్యాలు ఉంటే అగ్రస్థానంలో బాబర్‌ ఎందుకు ఉండడు?రెండుమూడు రోజులుగా అతడు జ్వరంతో బాధపడుతున్నాడు. మ్యాచ్‌కు ముందురోజు మాత్రమే అతడు సాధన చేయలేదు. ఆత్మవిశ్వాసం ప్రకారం చూసుకుంటే అతడికి ఇదే అత్యుత్తమ శతకం. ఫ్లాట్‌ పిచ్‌లపై అతడి శతకాలు చూశాను. ఇది మాత్రం కఠినమైన వికెట్‌. బంతి టర్న్‌ అయింది. ఫెర్గూసన్‌ చాలా వేగంగా బంతులు విసిరాడు. ప్రపంచకప్‌  కావడంతో ఒత్తిడి నెలకొంది’ అని గ్రాంట్‌ ఫ్లవర్‌ అన్నాడు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.