close

తాజా వార్తలు

‘గల్లీ బాయ్‌’ పాత్ర పోషించడానికే పుట్టానేమో!

బాలీవుడ్‌ నటుడు రణ్‌వీర్‌ సింగ్‌

‘గల్లీ బాయ్‌’ పాత్ర పోషించడానికే పుట్టానేమో!

ముంబయి: బాలీవుడ్‌ నటులు రణ్‌వీర్‌ సింగ్, ఆలియా భట్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘గల్లీ బాయ్‌’. జోయా అక్తర్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో రణ్‌వీర్‌ మంచి గాయకుడు కావాలని కలలు కనే యువకుడి పాత్రలో కనిపించాడు.ఆలియా కూడా మధ్య తరగతి కుటుంబానికి చెందిన యువతి పాత్రలో నటించింది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర బృందం మీడియాతో మాట్లాడింది.

ఇందులో భాగంగా రణ్‌వీర్‌ సింగ్‌ మాట్లాడుతూ..‘గల్లీబాయ్‌’ పాత్ర చేయాలని నాకే రాసిపెట్టిందేమో. నేను ఆ పాత్ర పోషించడానికే పుట్టానేమో!. నేను మాత్రమే ఆపాత్రను చేయగలను అనిపించింది. నేను చిన్నతనంలో కలకు కన్న ఆ ర్యాప్‌, హిప్‌-హోప్‌ మ్యూజిక్‌ తదితర అంశాలన్నీ ఈ చిత్రంలో ఉండటం ఆనందంగా ఉంది. జోయాకు నా బాల్యం గురించి తెలిసే నాకీ పాత్ర ఇచ్చారనుకుంటా. దీపికా ఈ ట్రైలర్‌ను చూసి ఎంతో సంతోషించింది. ఈ చిత్రం గురించి తానెంతగానో ఎదురుచూస్తోంది. ఇక సినిమాల విజయాల విషయానికొస్తే ఒక సినిమా విజయవంతమైనప్పుడు అందులో నటీనటుల కంటే నేనే ఎక్కువగా సంతోషపడుతుంటా. అదే సినిమా ఫ్లాప్‌ అయితే చాలా బాధపడుతుంటాను. సినిమాలో ఇవన్నీ సహజమే’ అని తెలిపారు.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.