
తాజా వార్తలు
‘ఆమె’ సినిమాను ఉద్దేశిస్తూ నటి లక్ష్మీ రామకృష్ణన్
చెన్నై: నటి అమలా పాల్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ఆమె’. రత్నకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇటీవల విడుదలైంది. అయితే ఈ సినిమాను ప్రముఖ నటి లక్ష్మీ రామకృష్ణన్ ఇటీవల వీక్షించారట. సినిమాపై తన అభిప్రాయాన్ని ట్విటర్ వేదికగా వెల్లడించారు. ‘అమల.. నువ్వు నటించిన ‘ఆమె’ సినిమా చూశాను. ప్రతి సన్నివేశం సినిమా కోసం నువ్వెంత కష్టపడ్డావో చెబుతోంది. ఈ నేపథ్యంలో నాతో ఓ చర్చలో పాల్గొనడానికి నువ్వు సిద్ధమేనా?ఓ నటిగా కాదు.. ఓ తల్లిగా, సగటు ప్రేక్షకురాలిగా నిన్ను, దర్శకుడు రత్నకుమార్ను పలు ప్రశ్నలు అడగాలని అనుకుంటున్నాను. చర్చకు సిద్ధమేనా?’ అని ప్రశ్నించారు. అయితే ఇందుకు అమలా పాల్ ఇంకా స్పందించలేదు.
ఇటీవల విడుదలైన ‘ఆమె’ సినిమా తమిళనాడులో మంచి టాక్ అందుకుంటోంది. అయితే ఇందులో అమల నగ్న సన్నివేశాల్లో నటించడం, నటి రమ్య సుబ్రహ్మణ్యంను ముద్దుపెట్టుకోవడం వంటి సన్నివేశాలు చర్చనీయాంశంగా మారాయి. లక్ష్మీ రామకృష్ణన్ కూడా ఇదే విషయంపై అమలతో, దర్శకుడు రత్నకుమార్తో చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది.
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- చెప్పేస్తుందేమోనని.. చంపేశారు
- 22 ఏళ్లకే ఐపీఎస్ అధికారి..!
- భారతా.. విండీసా.. వరుణుడా.. ఆరంభమెవరిదో?
- నలుదిశలా ఐటీ
- ఏమీ లేని స్థితిని చూసిన వాణ్ని
- తెలుగు రాష్ట్రాలు.. ఆసక్తికర చిత్రాలు
- షేవ్చేసుకోకుండా.. సేవ చేస్తారు
- యువతిపై అత్యాచారం.. ఆపై నిప్పు
- బాపట్లలో వింత శిశువు జననం
- ‘మా వస్తువులు మేమే డెలివరీ చేసుకుంటాం’
ఎక్కువ మంది చదివినవి (Most Read)
