close

తాజా వార్తలు

ఇది కట్టడాల 'మాయ'!

చూసొచ్చా! చిచెన్‌ ఇట్జా

హల్లో నేస్తాలూ! చిన్నూనొచ్చేశా! ఈసారి ఎక్కడికి వెళ్లొచ్చాననుకుంటున్నారూ...? చిచెన్‌ ఇట్జాకు... పేరు ఎప్పుడూ విననట్టున్నా... ఇక్కడున్న కట్టడం బొమ్మ చూస్తే మీరూ గుర్తుపట్టేస్తారు. ఎందుకంటే ఇది కొత్త ప్రపంచ వింతల్లో ఒకటి. నా టూర్‌ కబుర్లు మొదలెట్టెయ్యనా మరి?

అసలు ఏంటిది?

బోలెడు మెట్లతో ఉండే ఈ పిరమిడ్‌లాంటి కట్టడం చాలా మందికి పరిచయమే. దీన్ని టెంపుల్‌ ఆఫ్‌ కకుల్కన్‌గా పిలుస్తారు. మెక్సికోలోని యుకటన్‌ రాష్ట్రంలో ఉంది. ఈచుట్టుపక్కల అంటే నాలుగు చదరపు మైళ్ల విస్తీర్ణంలో ఇలాంటివే ఇంకా కొన్ని కట్టడాలుఉన్నాయి. ఆ ప్రాంతాన్నంతా కలిపి చిచెన్‌ ఇట్జా సిటీ లేకపోతే చిచెన్‌ఇట్జా కాంప్లెక్స్‌ అంటూ పిలిచేస్తారు.

వింతల్లో ఒకటి!

చిచెన్‌ ఇట్జా.. పేరు కాస్త చిత్రంగా ఉంది కదూ. ప్రపంచ కొత్త ఏడు వింతల్లో ఇదీ ఒకటి. 1988లో దీన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. అద్భుతమైన మాయన్ల వాస్తు కళకు ఇది ప్రసిద్ధి. ఇక్కడున్న బోలెడు కట్టడాల్లో దేనికదే ప్రత్యేకం.

ఇంకా ఏమేం కట్టడాలున్నాయి?

అప్పట్లోనే అద్భుతమైన ప్రణాళికతో కట్టిన కట్టడాలట ఇవన్నీ. గ్రేట్‌ నార్త్‌ ఫ్లాట్‌ఫాం, ఒస్సారియో గ్రూప్‌, సెంట్రల్‌ గ్రూప్‌, ఓల్డ్‌ చిచెన్‌, గ్రేట్‌ బాల్‌ కోర్ట్‌, టెంపుల్‌ ఆఫ్‌ ద జాగ్వర్స్‌ అనేవీ ప్రముఖమైనవే. వీటిలో ఒస్సారియో.. పిరమిడ్‌ ఆకారంలోనే ఉంటుంది.

ఎవరిదిది?

దీని పేరు చూసి ఇదేమన్నా చైనీయులదా? అని నాకు డౌటొచ్చేసింది. అదే అక్కడున్న గైడు అంకుల్‌ని అడిగాను. ఆయనేం చెప్పారంటే..? మెక్సికో, మధ్య అమెరికాల్లో పూర్వం మాయన్లు ఎక్కువగా నివసిస్తుండేవారట. మెక్సికోపై మాయ నాగరికత ప్రభావం
ఎక్కువట. క్రీస్తుపూర్వం 987 తర్వాత టోల్టెక్‌ రాజు క్వెట్జాల్కోటల్‌ మధ్య మెక్సికో నుంచి చిచెన్‌ఇట్జాకు దండయాత్రకు వచ్చాడు. ఈ ప్రాంతాన్ని తన రాజధానిగా తయారు చేసుకున్నాడు. ఆ రాజుల కాలంలో కట్టిన రకరకాల కట్టడాలే ఇక్కడున్నవి.

పిరమిడ్‌ కాదిది ఆలయం!

కకుల్కన్‌ .. ఓ సర్ప దేవతామూర్తికి సంబంధించిన గుడి. దీన్ని 11 నుంచి 13వ శతాబ్దాల మధ్య కాలంలో నిర్మించారు. పిరమిడ్‌ ఆకారంలో గుడిని కట్టడం దీని ప్రత్యేకత. నాలుగువైపులా తొంభై ఒక్క మెట్లతో ఉందిది. ఈ అంకె మాయన్ల పురాణాల్లో ప్రముఖమైనదట. మాయ క్యాలెండర్‌ విశేషాలూ ఈ గుడి గోడల మీద కనిపించాయి. ఈ కట్టడాలు, శిల్పాలు అంతా కలిసి ఈ ప్రాంతం ఎంతో ప్రత్యేకంగా అనిపించింది. ఈ కాలంలో ఎవరూ ఇలాంటి నిర్మాణాలు చెయ్యలేరేమో కదా. అందుకనే ఈ కబుర్లన్నీ మీతో పంచుకున్నా.

 


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.