
తాజా వార్తలు
చిరంజీవి త్వరలోనే ‘సైరా...’ అంటూ సందడి చేయబోతున్నారు. ప్రస్తుతం ఆ సినిమా ప్రచారంలోనే బిజీ బిజీగా ఉన్నారాయన. మరోపక్క తదుపరి చిత్రానికి కూడా రంగం సిద్ధమవుతోంది. కొరటాల శివ దర్శకత్వం వహించనున్న ఆ సినిమా వచ్చే నెల్లోనే పట్టాలెక్కనుంది. త్రివిక్రమ్ కూడా చిరు కోసం ఓ కథ సిద్ధం చేస్తున్నారు. ఇవి కాకుండా... మరో కథ కూడా చిరంజీవి కోసం ముస్తాబవుతోంది. మలయాళంలో విజయవంతమైన ‘లూసిఫర్’ సినిమా రీమేక్ హక్కుల్ని రామ్‌చరణ్ సొంతం చేసుకొన్నారు. మలయాళ అగ్ర కథానాయకుడు పృథ్వీరాజ్ ఓ కీలక పాత్రలో నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రమిది. మోహన్‌లాల్ కథానాయకుడిగా నటించారు. తండ్రి చిరంజీవి కోసమే ఈ సినిమా హక్కుల్ని రామ్‌చరణ్ సొంతం చేసుకొన్నారట. మోహన్‌లాల్ పోషించిన పాత్రని చిరంజీవి, పృథ్వీరాజ్ చేసిన పాత్రని రామ్‌చరణ్ చేసే అవకాశాలున్నట్టు సమాచారం. మరి ఈ చిత్రానికి కూడా పృథ్వీరాజే దర్శకత్వం వహిస్తారా లేక మరొకరికి ఆ బాధ్యతలు అప్పజెబుతారా అనేది చూడాలి. కొరటాల శివ, త్రివిక్రమ్ సినిమాల తర్వాతే ‘లూసిఫర్’ రీమేక్ పట్టాలెక్కే అవకాశముంది. ‘‘మీరు ‘లూసిఫర్’ రీమేక్ హక్కుల్ని తీసుకున్నారని తెలిసి ఆనందంగా ఉంది’’ అని పృథ్వీరాజ్ ట్వీట్ చేశారు.
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ఓ ఇంటివాడైన సాయిప్రణీత్
- వదిలేశారు..
- ‘నేను చనిపోతున్నా.. నా ఫ్యామిలీ జాగ్రత్త’
- వరుడు ఆలస్యం.. పెళ్లి రద్దు చేసిన వధువు!
- బాలికపై అత్యాచారానికి తల్లి సహకారం
- సైబరాబాద్ పోలీస్ వాట్సప్ నిలిపివేత
- త్వరలో వైకాపాలోకి గోకరాజు సోదరులు!
- త్వరలో అందుబాటులోకి మెట్రో రెండో కారిడార్
- ఎస్కేయూ ఉపకులపతి జయరాజ్ హఠాన్మరణం
- భారత్‌పై వెస్టిండీస్ విజయం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
