close

తాజా వార్తలు

సినిమా థియేటర్‌లో అగ్నిప్రమాదం

మలికిపురం: తూర్పుగోదావరి జిల్లా మలికిపురంలోని పద్మజా  థియేటర్‌లో అగ్నిప్రమాదం జరిగింది. మంటలు భారీగా చెలరేగడంతో లోపలిభాగం దగ్ధమైంది. షార్ట్‌సర్క్యూట్‌తో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం. అదృష్టవశాత్తూ ఆ సమయంలో ప్రేక్షకులెవరూ లోపల లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. విద్యుదాఘాతంతో థియేటర్‌లోని ఫర్నీచర్‌ మొత్తం కాలిబూడిదైంది. ప్రమాదం జరిగిన వెంటనే రాజోలు అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. సుమారు రూ.కోటిన్నర నష్టం వాటిల్లినట్లు నిర్వాహకులు తెలిపారు.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.