close

తాజా వార్తలు

పాత, కొత్త కలయికతో ప్రజల్లోకి వెళ్లాలి: నడ్డా

హైదరాబాద్‌: పాత, కొత్త నేతల కలయికతో పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని భాజపా కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా సూచించారు. నగరంలోని భాజపా కార్యాలయంలో పార్టీ పదాధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఎన్నికలు, సభ్యత్వ నమోదు, పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై నడ్డా చర్చించారు. ఈ అంశాలపై ప్రధానంగా దృష్టి సారించాలని నేతలకు ఆయన దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌, కేంద్ర సహాయమంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీలు బండి సంజయ్‌, సోయం బాపురావు, ధర్మపురి అర్వింద్‌తో పాటు నేతలు డీకే అరుణ, జితేందర్‌రెడ్డి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, బాబూమోహన్‌ తదితరులు హాజరయ్యారు. 


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.