close

తాజా వార్తలు

సచిన్‌, హర్భజన్‌ మధ్య ఆసక్తికర ఘటన

అలనాటి స్మృతులను గుర్తు చేసుకున్న దిగ్గజాలు

కోల్‌కతా: భారత్‌, బంగ్లాదేశ్‌ డేనైట్‌ టెస్టు సందర్భంగా శుక్రవారం తొలి రోజు భోజన విరామ సమయంలో దిగ్గజ క్రికెటర్లు సచిన్‌, హర్భజన్‌, వీవీఎస్‌ లక్ష్మణ్‌, అనిల్‌ కుంబ్లే ముచ్చటించారు. ఈ సందర్భంగా టీమిండియాతో వారికున్న మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. 2001 ఈడెన్‌లో ఆసీస్‌తో తలపడిన చారిత్రక మ్యాచ్‌ విశేషాలతో పాటు అనేక విషయాలపై చర్చించారు. ఈ నేపథ్యంలో క్రికెట్‌ లెజెండ్‌ సచిన్‌ మాట్లాడుతూ తొలిసారి తను.. హర్భజన్‌సింగ్‌ బౌలింగ్‌ను ఎదుర్కొన్న నాటి సరదా సంఘటల్ని గుర్తు చేసుకొన్నారు. 

‘‘1996లో మేం తొలిసారి మొహాలీ వేళ్లినప్పుడు అక్కడ ఓ యువకుడు అద్భుతంగా బౌలింగ్‌ చేస్తాడని స్థానికులు నాతో చెప్పారు. అతను ఆఫ్‌ స్పిన్‌, దూస్రాలు విసురుతాడని చెప్పడంతో.. నేను అతడిని పిలిచి నెట్స్‌లో బౌలింగ్‌ చేయమన్నాను. అతని బౌలింగ్‌ బాగుంటే ప్రోత్సహిద్దామనుకున్నా. అలా భజ్జీ నాకు బంతులేయడం మొదలుపెట్టాడు. బౌలింగ్‌ చేస్తున్నంత సేపు నా వద్దకు వచ్చి ‘జీ పాజీ’ అనేవాడు. అప్పుడు నేను.. ‘ఏంటి?అని అడిగి.. వెళ్లి బౌలింగ్‌ చెయ్‌’ అనేవాడిని. అలా హర్భజన్‌ చాలాసార్లు నా వద్దకు వచ్చినా, ఎందుకు వస్తున్నడనే విషయం అర్థం కాలేదు. తర్వాత భజ్జీ జట్టులోకి వచ్చాక ఒకర్నొకరు అర్థం చేసుకోవడం ప్రారంభించాం. అప్పుడు మళ్లీ నా వద్దకు వచ్చి ‘పాజీ.. మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా’ అని అన్నాడు. సరే అడుగమని చెప్పా. ‘నేను మీకు తొలిసారి నెట్స్‌లో బౌలింగ్‌ చేసినప్పుడు నన్నెందుకు తరచూ మీ వద్దకు రమ్మని పిలిచారు? అని అన్నాడు. ‘నిన్ను నేనెప్పుడు పిలిచా?’ అని తిరిగి ప్రశ్నించాను. ఆ తర్వాత అర్థం అయిన విషయం ఏమిటంటే.. నా హెల్మెట్‌ను సరిచేసుకునే పద్ధతిని చూసి, నేను పిలుస్తున్నానని భావించి భజ్జీ నా వద్దకు వచ్చేవాడు’’ అని అసలు విషయం బయటపెట్టారు మాస్టర్‌ బ్లాస్టర్‌.

ఈ విషయంపై హర్భజన్‌ స్పందిస్తూ ‘నేను బౌలింగ్‌ చేస్తూనే, సచిన్‌ ఎలా ఆడతున్నారని గమనించేవాడిని. అలానే అతని వద్దకు వెళ్లేవాడిని. అప్పుడు సచిన్‌ ‘ఏమైందని’ అడిగేవారు. ‘మీరే కదా పిలిచారు?’ అనేవాడిని. ఒక అభిమానిగా ఆ ఘటన నాకెంతో ప్రత్యేకం. ఆ తర్వాత నా పరిస్థితులన్నీ మారిపోయి, టీమిండియాకు ఆడటం ప్రారంభించాను. ఇలాంటి దిగ్గజాలతో కలిసి బౌలింగ్‌ చేసే అవకాశం దక్కింది. వారితో కలిసి ప్రయాణం చేశాను. నా జీవితంలో ఇంతకన్నా అద్భుత సమయం ఉంటుందని ఊహించలేను’ అని స్పిన్‌ దిగ్గజం చెప్పుకొచ్చాడు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.