close

తాజా వార్తలు

ఇంటికొస్తారు.. ఐఐటీ ప్రొఫెసర్లు!

383 రకాల విభిన్న కోర్సులు

రిజిస్ట్రేషన్లకు ఎన్‌పీటీఈఎల్‌ ఆహ్వానం

ఆన్‌లైన్‌ పాఠాలు జనవరిలో మొదలు

ఒక మాదిరి స్థాయి నిపుణులు చెప్పిన వీడియో పాఠాలు వినాలంటే వేలల్లో ఫీజు చెల్లించాలి. అదే ఐఐటీ, ఐఐఎస్సీ ప్రొఫెసర్లు పాఠాలైతే.. పెద్దమొత్తంలో చెల్లించాలేమో అనుకుంటున్నారా? ఈ సౌలభ్యం పూర్తి ఉచితంగా లభిస్తోందంటే నమ్మగలరా? ఆసక్తి ఉంటే చాలు.. విద్యార్హతలతో సంబంధం లేకుండా ఆన్‌లైన్‌లో ఉచితంగా వీడియో పాఠాలు వీక్షించవచ్ఛు 383 రకాల కోర్సులు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రవేశానికి నేషనల్‌ ప్రోగ్రాం ఆన్‌ టెక్నాలజీ ఎన్‌హ్యాన్స్‌డ్‌ లర్నింగ్‌ (ఎన్‌పీటీఈఎల్‌) రిజిస్ట్రేషన్లను ఆహ్వానిస్తోంది. చదువుతోన్న కోర్సుల్లో మరింత పరిజ్ఞానం పొందడానికీ, కొత్త సబ్జెక్టుల్లో ప్రావీణ్యానికీ ఈ వీడియో పాఠాలు ఉపయోగపడతాయి!

ఇంజినీరింగ్‌, డిజైన్‌, హ్యుమానిటీస్‌ అండ్‌ సోషల్‌ సైన్సెస్‌, మేనేజ్‌మెంట్‌, మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, ఇంకా మల్టీ డిసిప్లినరీ కోర్సుల్లో ఈ వీడియో పాఠాలు అందిస్తున్నారు.

ఇంజినీరింగ్‌లో కంప్యూటర్‌ సైన్స్‌, మెకానికల్‌, సివిల్‌, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌, మెటలర్జీ బ్రాంచీలవారీ కోర్సులు లభిస్తున్నాయి. ఇవన్నీ ప్రస్తుతం బీటెక్‌, ఎంటెక్‌ కోర్సులు చదువుతున్నవారికీ, గేట్‌, ఈఎస్‌ఈ తదితర పోటీ పరీక్షార్థులకు ఉపయోగపడతాయి. ● బ్యాంకు, ఎస్‌ఎస్‌సీ, రైల్వే...తదితర పోటీ పరీక్షల అభ్యర్థుల కోసం ‘ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ ఫర్‌ కాంపిటీటివ్‌ ఎగ్జామ్స్‌’ కోర్సు అందిస్తున్నారు. ● ఉద్యోగ సాధనలో, దైనందిన వ్యవహారాల్లో ప్రతిచోటా సాఫ్ట్‌స్కిల్స్‌ కీలకం. ఇవి ఒంటబట్టినవారు క్లిష్టమైన వ్యవహారాలనూ, మానవ సంబంధాలనూ సులువుగా నిర్వర్తించగలుగుతున్నారు. ఇందులో మెలకువలను తెలుసుకోవడానికి సాఫ్ట్‌స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కోర్సులో చేరిపోవచ్ఛు ● మాటే మంత్రం అంటారు. అదెలాగో తెలుసుకోవడానికి ‘స్పీకింగ్‌ ఎఫెక్టివ్‌లీ’ కోర్సులో చేరితే సరిపోతుంది. ● ప్రభావవంతంగా రాయాలని ఆశించేవారికోసం ‘ఎఫెక్టివ్‌ రైటింగ్‌’ కోర్సు ఉంది. ● ఎమోషనల్‌ ఇంటలిజెన్స్‌, సీ, జావా, క్లౌడ్‌ కంప్యూటింగ్‌, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌, టెస్టింగ్‌, డేటా సైన్స్‌, డేటా ఎనలిటిక్స్‌, మెషిన్‌ లర్నింగ్‌, పైథాన్‌..తదితర కోర్సులెన్నో ఉన్నాయి. ● ఐఐటీ ప్రవేశపరీక్ష జేఈఈకి సిద్ధమవుతున్నవారి కోసం, బీఎస్సీ, ఎమ్మెస్సీ, ఇంజినీరింగ్‌ ప్రథమ సంవత్సరం కోర్సుల్లో ఉన్న విద్యార్థుల కోసం మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో క్లిష్టమైన అంశాలను తేలికగా అర్థమయ్యేలా బోధించడానికి ప్రొఫెసర్లు సిద్ధంగా ఉన్నారు.

ఆసక్తి ఉన్నవారు https://swayam.gov.in/NPTEL, https://onlinecourses.nptel.ac.in/ వెబ్‌సైట్లలో వివరాలు నమోదు చేసుకోవచ్ఛు

విద్యా నేపథ్యం, అవసరాన్ని బట్టి నచ్చిన కోర్సు ఎంచుకోవచ్ఛు అర్హతలు, వయసు పరిమితి ఏదీ లేదు. ఈ వీడియోల్లో ఐఐటీలు, ఐఐఎస్సీ, ఐఐఎస్‌ఈఆర్‌లు, ఇతర పేరున్న సంస్థల్లోని ప్రొఫెసర్లు పాఠాలను బోధిస్తారు.

ఇదీ షెడ్యూల్‌...

ఆన్‌లైన్‌ పాఠాలు వచ్చే జనవరిలో మొదలై ఏప్రిల్‌ వరకు కొనసాగుతాయి. జనవరి - ఏప్రిల్‌ సెషన్‌లో అన్ని విభాగాల్లోనూ కలుపుకుని మొత్తం 383 కోర్సులు అందుబాటులో ఉంచారు. కోర్సు నేపథ్యం, పరిధి బట్టి వీటిని 4, 8, 12 వారాల వ్యవధితో నిర్వహిస్తారు. కోర్సును బట్టి ప్రతివారం దాదాపు 4 గంటలు వీడియో పాఠాలు అందిస్తారు. ఏవైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకునే సౌలభ్యమూ ఉంది. ప్రగతి ఎలా ఉందో తెలుసుకోవడానికి వారంవారం అసైన్‌మెంట్లు కూడా ఇస్తారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు కోర్సు పూర్తయిన తర్వాత పరీక్షలు సైతం రాసుకోవచ్ఛు ఇందులో అర్హత సాధించినవారికి ఎలక్ట్రానిక్‌ సర్టిఫికెట్‌ ప్రదానం చేస్తారు. ఈ సర్టిఫికెట్లు ఉద్యోగాన్వేషణలో ఉపయోగపడతాయి. పరీక్ష రాసి సర్టిఫికెట్‌ పొందడానికి రూ.వెయ్యి చెల్లించాల్సి ఉంటుంది. పరీక్ష రాయాలనుకున్నవారు అసైన్‌మెంట్లను పూర్తిచేయడం తప్పనిసరి. వీటిలో కనీస మార్కులు పొందితేనే పరీక్ష రాయడానికి వీలవుతుంది. సర్టిఫికెట్‌ పొందడానికి అసైన్‌మెంట్లకు 25 శాతం, పరీక్షకు 75 శాతం వెయిటేజీ ఉంటుంది.

4, 8 వారాల వ్యవధి ఉండే కోర్సులు రెండు విడతల్లో మొదలవుతాయి. 4 వారాల కోర్సుల మొదటి సెషన్‌ జనవరి 27తో మొదలై ఫిబ్రవరి 21తో ముగుస్తుంది. రెండో విడత ఫిబ్రవరి 24తో మొదలై మార్చి 20తో ముగుస్తుంది.

8 వారాల కోర్సులు తొలి విడత జనవరి 27తో మొదలై మార్చి 20 వరకు కొనసాగుతాయి. రెండో విడతలో ఫిబ్రవరి 24 నుంచి ఏప్రిల్‌ 17 వరకు ఉంటాయి. 12 వారాల కోర్సులు మాత్రం జనవరి 27 నుంచి ఏప్రిల్‌ 17 వరకు ఒక సెషన్‌ లోనే ఉంటాయి.

సెషన్‌ 1 కోర్సుల్లో చేరినవారికి మార్చి 29న పరీక్షలు నిర్వహిస్తారు. సెషన్‌ 2 కోర్సులు, 12 వారాల కోర్సులకు ఏప్రిల్‌ 25న పరీక్షలు జరుగుతాయి.

ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ ఫర్‌ కాంపిటీటివ్‌ ఎగ్జామినేషన్స్‌ కోర్సు ఉదాహరణగా తీసుకుంటే.. దీన్ని 12 వారాల వ్యవధితో నిర్వహిస్తున్నారు. ఈ తరగతులను ఐఐటీ మద్రాస్‌లో ప్రొఫెసర్‌గా పనిచేస్తోన్న అయేషా ఇక్బాల్‌ బోధిస్తారు. ఇందులో భాగంగా పోటీ పరీక్షలకు అవసరమైన అడ్వాన్స్‌డ్‌- గ్రామర్‌, ఒకాబ్యులరీ, రీడింగ్‌, రైటింగ్‌ అంశాలను బోధిస్తారు. ప్రాక్టీస్‌ టెస్టులు ఉంటాయి. ఈ కోర్సు జనవరి 27తో మొదలై, ఏప్రిల్‌ 17తో ముగుస్తుంది. ఆసక్తి ఉన్నవారికోసం పరీక్షను ఏప్రిల్‌ 25న నిర్వహిస్తారు. పరీక్ష నిమిత్తం రూ.వెయ్యి ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

సబ్జెక్టువారీగా...

హ్యుమానిటీస్‌ అండ్‌ సోషల్‌ సైన్సెస్‌: లిటరేచర్‌ ఫర్‌ కాంపిటీటివ్‌ ఎగ్జామ్స్‌, ఎకనామిక్‌ గ్రోత్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌, లాంగ్వేజ్‌ అండ్‌ మైండ్‌, మోడర్న్‌ ఇండియన్‌ రైటింగ్‌ ఇన్‌ ట్రాన్స్‌లేషన్‌, పొలిటికల్‌ థియరీ, పొలిటికల్‌ థాట్‌, ఫెమినిజం, కల్చరల్‌ స్టడీస్‌, ఎఫెక్టివ్‌ రైటింగ్‌, సాఫ్ట్‌స్కిల్‌ డెవలప్‌మెంట్‌, ఎమోషనల్‌ ఇంటలిజెన్స్‌, స్పీకింగ్‌ ఎఫెక్టివ్‌లీ, హ్యూమన్‌ బిహేవియర్‌, జర్మన్‌, బ్రెయిన్‌ అండ్‌ బిహేవియర్‌, కాగ్నిటివ్‌ సైకాలజీ.. ఇలా 40 అంశాల్లో వివిధ వ్యవధులతో కోర్సులు అందిస్తున్నారు.

మల్టీ డిసిప్లినరీ: ఎథిక్స్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌ ప్రాక్టీస్‌, ఇంట్రడక్షన్‌ టు రిసెర్చ్‌, థర్మో డైనమిక్స్‌, ఆంత్రప్రెన్యూర్‌షిప్‌ ఎసెన్షియల్స్‌...తదితర అంశాలున్నాయి.

మేనేజ్‌మెంట్‌: ఇంటిగ్రేటెడ్‌ మార్కెటింగ్‌, గ్లోబల్‌ మార్కెటింగ్‌, మార్కెటింగ్‌ రిసెర్చ్‌ అండ్‌ ఎనాలిసిస్‌, క్వాలిటీ డిజైన్‌ అండ్‌ కంట్రోల్‌, సిక్స్‌ సిగ్మా, సప్లై చెయిన్‌, కన్‌జ్యూమర్‌ బిహేవియర్‌, మార్కెటింగ్‌ ఎనలిటిక్స్‌, బిజినెస్‌ స్టాటిస్టిక్స్‌, ఆపరేషన్స్‌ రిసెర్ఛ్‌.ఇలా 30కు పైగా కోర్సులు నేర్చుకోవచ్ఛు ఎంబీఏ, బీబీఎం, బీబీఏ చదువుతున్నవారితోపాటు సాధారణ పాఠకులకు సైతం ఈ మేనేజ్‌మెంట్‌ పాఠాలు ఉపయోగపడతాయి.

మ్యాథ్స్‌: లీనియర్‌ ఆల్జీబ్రా, ఇంజినీరింగ్‌ మ్యాథ్స్‌, కాల్‌క్యులస్‌, ప్రాబబిలిటీ, స్టాటిస్టిక్స్‌...ఇలా 20 అంశాలు ఉన్నాయి.

ఫిజిక్స్‌: క్వాంటమ్‌ మెకానిక్స్‌, ఫైబర్‌ ఆప్టిక్స్‌, ఎలక్ట్రోమాగ్నటిజం, ఎక్స్‌పరిమెంట్‌ ఫిజిక్స్‌, ఆప్టికల్‌ సెన్సార్స్‌ ..మొదలైనవి ఉన్నాయి.

కెమిస్ట్రీ: ఆర్గానిక్‌ కెమిస్ట్రీ, ఇనార్గానిక్‌ కెమిస్ట్రీ, క్వాంటిటేటివ్‌ మెథడ్స్‌ ఇన్‌ కెమిస్ట్రీ..ఇవన్నీ నేర్చుకోవచ్ఛు

ఇంజినీరింగ్‌లో...

కంప్యూటర్‌ సైన్స్‌: ఈ కోర్సులు బీఎస్సీ, బీసీఏ, ఎంసీఏ, బీటెక్‌, ఎంటెక్‌ కోర్సులు చదువుతోన్న విద్యార్థులతోపాటు సాధారణ గ్రాడ్యుయేట్లకు సైతం ఉపయోగకరమైనవే. సీ++, జావా, పైథాన్‌, డీబీఎంఎస్‌, ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌, డేటా సైన్స్‌, డేటా ఎనలిటిక్స్‌, మెషిన్‌ లర్నింగ్‌, డీప్‌ లర్నింగ్‌, వీఎల్‌ఎస్‌ఐ, టెస్టింగ్‌, క్లౌడ్‌ కంప్యూటింగ్‌, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌, క్రిప్టోగ్రఫీ..ఇలా 50కు పైగా అంశాల్లో ఆసక్తి ఉన్నవాటిని నేర్చుకునే సౌలభ్యం ఉంది.

ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఎలక్ట్రికల్‌: సిగ్నల్స్‌ అండ్‌ సిస్టమ్స్‌, నెట్‌వర్క్‌ ఎనాలిసిస్‌, ఐసీ డిజైన్‌, పవర్‌ సిస్టమ్స్‌, కంట్రోల్‌ ఇంజినీరింగ్‌, ఫొటోనిక్స్‌, ఆప్టికల్‌ ఇంజినీరింగ్‌..ఇలా 50కు పైగా అంశాలున్నాయి.

మెకానికల్‌: పవర్‌ ప్లాంట్‌ ఇంజినీరింగ్‌, థర్మో డైనమిక్స్‌ లాస్‌, ఫ్లూయిడ్‌ మెకానిక్స్‌, ఆపరేషన్స్‌ మేనేజ్‌మెంట్‌, ప్రొడక్ట్‌ డిజైన్‌ అండ్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌, రోబోటిక్స్‌ అండ్‌ కంట్రోల్‌ తదితర అంశాల్లో 40 కోర్సులు అందిస్తున్నారు.

సివిల్‌: మోడర్న్‌ కన్‌స్ట్రక్షన్‌ మెటీరియల్స్‌, స్ట్రక్చర్‌ డైనమిక్స్‌, ప్లాస్టిక్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌...ఇలా 31 అంశాల్లో కోర్సులున్నాయి.

టెక్స్‌టైల్‌ ఇంజినీరింగ్‌, మెటలర్జికల్‌ అండ్‌ మెటీరియల్‌ ఇంజినీరింగ్‌, ఓషన్‌ ఇంజినీరింగ్‌ల్లోనూ పాఠాలు అందుబాటులో ఉన్నాయి.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.