Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 121842
            [news_title_telugu_html] => 

అంచనాలు తలకిందులు చేసిన క్రికెట్‌హీరో

[news_title_telugu] => అంచనాలు తలకిందులు చేసిన క్రికెట్‌హీరో [news_title_english] => Pataudi was last among of old-fashioned amateurs Jeffrey Archer [news_short_description] => కారు ప్రమాదంలో గాయపడ్డాక టీమిండియా మాజీ సారథి మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ క్రికెట్ ఆడలేడేమో అనుకున్నానని ప్రముఖ ఇంగ్లిష్ నవలా రచయిత జెఫ్రీ ఆర్చర్ అన్నారు. పట్టుదల విషయంలో ఎవరైనా ఆయన తర్వాతే నిలుస్తారని.... [news_tags_keywords] => Mansur Ali Khan Pataudi, Anil Kumble,Jeffrey Archer,Virat Kohli [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-07-05 18:16:06 [news_isactive] => 1 [news_status] => 2 ) )
అంచనాలు తలకిందులు చేసిన క్రికెట్‌హీరో - Pataudi was last among of old-fashioned amateurs Jeffrey Archer - EENADU
close

తాజా వార్తలు

అంచనాలు తలకిందులు చేసిన క్రికెట్‌హీరో

పటౌడీ పట్టుదలకు ఎవరూ సాటిరారు

కుంబ్లే హుందాతనం ఆదర్శం: జెఫ్రీ ఆర్చర్‌

లీడ్స్‌: కారు ప్రమాదంలో గాయపడ్డాక టీమిండియా మాజీ సారథి మన్సూర్‌ అలీ ఖాన్‌ పటౌడీ క్రికెట్‌ ఆడలేడేమో అనుకున్నానని ప్రముఖ ఇంగ్లిష్‌ నవలా రచయిత జెఫ్రీ ఆర్చర్‌ అన్నారు. పట్టుదల విషయంలో ఎవరైనా ఆయన తర్వాతే నిలుస్తారని వెల్లడించారు. మంకీ గేట్‌ వివాదంలో కుంబ్లే చూపిన హుందాతనం, ప్రస్తుతం విరాట్‌ కోహ్లీ తెలివైన సారథ్యం గురించి ఆయన మాట్లాడారు. ఇంగ్లాండ్‌లో జరుగుతున్న ప్రపంచకప్‌ను అనుసరిస్తున్న జెఫ్రీ భారత క్రికెట్‌పై తన ప్రేమను మరోసారి చాటారు.

నాకో గౌరవం

‘పటౌడీ నవాబ్‌ తెలియడమే నాకో గౌరవం. ఆక్స్‌ఫర్డ్‌లో చదివేటప్పటి నుంచి మేమిద్దరం మంచి మిత్రులం. ఆయన సతీమణి (షర్మిలా ఠాగూర్‌), కుమార్తె కోసం ఈ మధ్యే పెద్ద చారిటీ వేలం నిర్వహించాను. కళాశాలలో నేనో అథ్లెట్‌ను. ఆక్స్‌ఫర్డ్‌లో సారథిగా ఉన్నాను. బ్రిటన్‌ తరఫున పరుగెత్తాను. తొలుత మేమిద్దరం విన్సెంట్స్‌లో కలిశాం. నేను ఎలాంటి క్రికెట్‌ ప్రేమికుడినో పటౌడీకి బాగా తెలుసు. ఇప్పటికీ నేను క్రికెట్‌ అనుసరిస్తున్నాను. కారు ప్రమాదంలో టైగర్‌ పటౌడీ గాయపడ్డప్పుడు ఆయన తిరిగి క్రికెట్‌ ఆడడనే అనుకున్నా. అతడి అద్భుతమైన మూర్తిమత్వాన్ని, పట్టుదలను తక్కువ అంచనా వేశా. కానీ ఆయన దేనినీ వదిలిపెట్టరు. అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్‌ ఆడటం ఆక్స్‌ఫర్డ్‌లో పటౌడీని పెద్ద హీరోను చేసింది’ అని ఆర్చర్‌ గుర్తుచేసుకున్నారు.

తెలివైన కోహ్లీ

కొన్నేళ్లుగా ఆర్చర్‌ భారత క్రికెట్‌లో సచిన్‌ నుంచి కోహ్లీ వరకు అగ్రశ్రేణి ఆటగాళ్లను కలుస్తూనే ఉన్నారు. ‘ఈ మధ్యే విరాట్‌ కోహ్లీని కలిశాను. తెలివైన సారథి. అతడి పరిజ్ఞానం మరో స్థాయిలో ఉంది. పుస్తకంలోని అన్ని క్రికెట్‌ రికార్డులను అతడు బద్దలు కొడతాడు. అయితే టైగర్‌ పటౌడీ మాత్రం నాకెప్పటికీ ఫేవరెట్‌’ అని ఆర్చర్‌ అన్నారు. మంకీ గేట్‌ వివాదంలో కుంబ్లే వ్యవహార దక్షత అందరికీ ఆదర్శమని తెలిపారు. ‘మనం చూసిన అత్యుత్తమ సారథుల్లో కుంబ్లే ఒకరు. ఆస్ట్రేలియాకు రికీ పాంటింగ్‌ నాయకుడిగా ఉన్నప్పుడు ఆ వివాదంలో జంబో ప్రవర్తన మనందరికీ ఒక ఉదాహరణ. ఎంతో హుందాగా వ్యవహరించి అందరికీ ఆదర్శంగా నిలిచాడు’ అని ఆర్చర్‌ అన్నారు.

గొప్ప మ్యాచ్‌

ఈడెన్‌లో 2001లో ఆస్ట్రేలియా, భారత్‌ మధ్య జరిగిన టెస్టు తనకిష్టమైన మ్యాచుల్లో ఒకటని జెఫ్రీ అన్నారు. ‘వీవీఎస్‌ లక్ష్మణ్‌, రాహుల్‌ ద్రవిడ్‌ ఒకరోజుకు పైగా క్రీజులో ఉన్నారు. ఈ పోరు అప్పటికీ ఎప్పటికీ చరిత్రలో అత్యంత గొప్ప మ్యాచే. ద్రవిడ్‌, లక్ష్మణ్‌ క్షుణ్ణంగా అధ్యయనం చేస్తారు. ఎంతో తెలివైనవారు’ అని జెఫ్రీ తెలిపారు.

భార్యలు చదువుతారు!

మీ పుస్తకాలను క్రికెటర్లు చదువుతారా? అని అడిగిన ప్రశ్నకు జెఫ్రీ ఇలా జవాబిచ్చారు. ‘క్రికెటర్లా?ఆ! చదువుతారు. కానీ వారి సతీమణులు ఇంకా ఎక్కువ చదువుతారు. అంటే సచిన్‌ భార్య, కుంబ్లే భార్య నా రచనలకు ఎక్కువ మద్దతిస్తారు’ అని తెలిపారు. జెఫ్రీ రాసిన నవలల్లో ‘కేన్‌ అండ్‌ అబెల్‌’ సిరీస్‌ ప్రఖ్యాతి గాంచింది. ‘సెంచరీ’ అనే చిన్నకథ టైగర్‌ పటౌడీ ఆధారంగా ఆయన రాశారని అంటారు.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.