Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 143396
            [news_title_telugu_html] => 

పుణ్యలోకాలు చేరేందుకు ఎందుకింత తొందర

[news_title_telugu] => పుణ్యలోకాలు చేరేందుకు ఎందుకింత తొందర [news_title_english] => I will miss my friend says Team India Womens Coach WV Raman [news_short_description] => టీమ్‌ఇండియా మాజీ ఓపెనర్‌ వీబీ చంద్రశేఖర్‌(58) మృతి పట్ల ఆయన మిత్రుడు, భారత మహిళా జట్టు కోచ్‌ డబ్ల్యూవీ రామన్‌ తీవ్ర మనోవేదనకు... [news_tags_keywords] => Team India ,Cricket ,BCCI ,VB Chandrasekhar [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-17 23:23:36 [news_isactive] => 1 [news_status] => 2 ) )
పుణ్యలోకాలు చేరేందుకు ఎందుకింత తొందర - I will miss my friend says Team India Womens Coach WV Raman - EENADU
close

తాజా వార్తలు

పుణ్యలోకాలు చేరేందుకు ఎందుకింత తొందర

 చంద్రశేఖర్‌ మృతిపై భారత మహిళా కోచ్‌ 

చెన్నై: టీమిండియా మాజీ ఓపెనర్‌ వీబీ చంద్రశేఖర్‌ (58) మృతిపై ఆయన మిత్రుడు, భారత మహిళా క్రికెట్‌ జట్టు కోచ్‌ డబ్ల్యూవీ రామన్‌ తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఈ షాక్‌ నుంచి కోలుకోలేకపోతున్నానని చెప్పాడు. చంద్రశేఖర్‌ చాలా తొందరగా వెళ్లిపోయారని బాధపడ్డాడు. అంతా అకస్మాత్తుగా జరిగిపోయిందని పేర్కొన్నాడు. ఎన్నో ఏళ్లుగా తమ మధ్య స్నేహం కొనసాగుతోందని, అండర్‌-22 స్థాయి నుంచే ఇద్దరూ కలిసి ఎక్కువ క్రికెట్‌ ఆడామని వెల్లడించాడు. చంద్రశేఖర్‌ అవిశ్రాంత యోధుడని, స్థానిక క్రికెట్‌లో ప్రత్యర్థులుగా ఎన్నో క్రికెట్‌ మ్యాచ్‌లు ఆడామని గుర్తుచేసుకున్నాడు. తమిళనాడు జట్టుకు కలిసి ఆడే రోజుల్లో అనేక విషయాలు చర్చించుకునేవాళ్లమని చెప్పాడు.

చంద్రశేఖర్‌ అద్భుతమైన వ్యక్తని, ఎవరైనా సరే.. ఏ విషయంలోనైనా ఆయనతో చర్చించొచ్చని రామన్‌ అన్నాడు. క్రికెట్‌ ఆడే రోజుల్లో అతని బ్యాటింగ్‌తో అలరించేవాడని పేర్కొన్నాడు. అతడితో ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయని, ఇంటర్‌ యూనివర్శిటీ పోటీల్లో పాల్గొనే రోజుల్లో రైల్వేస్టేషన్‌లో చెస్‌ ఆడిన సందర్భాలూ ఉన్నాయని తెలిపాడు. రంజీ క్రికెట్‌లో అతడి ఆట ఎప్పటికీ గుర్తుండి పోతుందని, 1987-88 కాలంలో తమిళనాడు తరఫున 551 పరుగులు సాధించి జట్టును విజయం తీరాలకు చేర్చాడని తెలిపాడు. ఆపై ఇరానీ ట్రోఫీ సందర్భంగా రెస్టాఫ్‌ ఇండియాపై 56 బంతుల్లో శతకం బాది రికార్డు (అప్పటికి ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో వేగవంతమైన సెంచరీ) నెలకొల్పాడని వివరించాడు. 

ఆ శతకం ఎప్పటికీ ప్రత్యేకంగా నిలుస్తుందని రామన్‌ అన్నాడు. ఈ మధ్య కాలంలో కలుసుకోవడం కుదరకపోవడంతో ఫోన్‌లో మాట్లాడుకుంటున్నామని వెల్లడించాడు. తమిళనాడు వీబీ కంచి వీరన్స్‌ జట్టును విజయ పథంలో నడిపించాలని కోరుకునేవాడని రామన్‌ చెప్పుకొచ్చాడు. అందుకు తానూ కొన్ని వీడియోలు సైతం పంపానని అన్నాడు. ఏదేమైనప్పటికీ చంద్రశేఖర్‌ ఈ వయసులో వెళ్లిపోకుండా ఉండాల్సిందని రామన్‌ భావోద్వేగం చెందాడు.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.